రీసెంట్ గా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికలలో ఛాంబర్ అధ్యక్షునిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు. అయితే ఈ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని చిత్ర పరిశ్రమని బాగు చేసే ఉద్దేశ్యం సురేష్ బాబు బృందం లో లేదని, తెలుగు ఫిలిం ఛాంబర్ ను రెండు భాగాలుగా చేయాలని అల్లాని శ్రీధర్, మురళిమోహన్ రావు, నట్టికుమార్ మంగళవారం హైదరాబాద్ లోని ప్రెస్ మీట్ ను నిర్వహించి వెల్లడించారు. ఈ సందర్భంగా..
నట్టికుమార్ మాట్లాడుతూ "తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో అవకతవకలు జరిగాయి. సురేష్ బాబు ప్రెసిడెంట్ గా ఎన్నికైన తరువాత విజయవాడ ఫిలిం ఛాంబర్ లో శ్రీమంతుడు చిత్రం బ్లాక్ టికెట్స్ అమ్మకాలు జరిగాయి. సురేష్ బాబు రీజనల్ లో ఉన్న థియేటర్లలోనే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయి. థియేటర్లు లీజ్ తీసుకొని సినిమాలు రిలీజ్ చేసే వారికి మేము వ్యతిరేకం కాదు. సర్వీస్ టాక్సెస్ అన్ని పక్కాగా ప్రభుత్వానికి చెల్లిస్తే మాకు డెవలప్పింగ్ ఫండ్ వస్తుంది. తెలంగాణా రాష్ట్రం ఆవిర్భవించాక అన్ని శాఖలు సెపరేట్ అయ్యాయి. తెలుగు ఫిలిం ఛాంబర్ ను కూడా రెండు భాగాలుగా చేయాలి" అని చెప్పారు.
సానాయాదిరెడ్డి మాట్లాడుతూ "రెండు రాష్ట్రాలు ఉన్నప్పుడు రెండు ఛాంబర్స్ ఉండాలి. ఈ విషయంపై చాలా పోరాడాం" అని చెప్పారు.
ఇంకా ఈ కార్యక్రమంలో సంగిసెట్టి దసరథ్, అల్లాని శ్రీధర్, సంగకుమార్ తదితరులు పాల్గొన్నారు.