Advertisementt

పైరసీ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది!

Sat 08th Aug 2015 11:51 AM
anti piracy press meet,bahubali,sreemanthudu,dil raju  పైరసీ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది!
పైరసీ విషయంలో ప్రభుత్వం చర్యలు తీసుకోనుంది!
Advertisement
Ads by CJ

చలనచిత్ర పరిశ్రమను ఓ వ్యాధిలా పట్టి పీడిస్తున్న పైరసీను అరికట్టించాలని గత కొన్ని రోజులుగా చర్చలు జరుగుతున్నాయి. 'బాహుబలి' సినిమా విడుదల సమయంలో ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు ప్రత్యేకంగా ప్రెస్ మీట్ ను నిర్వహించి పైరసీ జరిగితే ఎలాంటి చర్యలు తీసుకుంటారో కూడా వెల్లడించారు. ఇప్పటివరకు పైరసీ విషయంలో లోకల్ పోలీస్ వారు, ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ వారు చర్యలు తీసుకునేవారు. అయితే ఇప్పుడు ప్రభుత్వం ఈ విషయాన్ని సీరియస్ గా తీసుకొని 'శ్రీమంతుడు' విడుదలకు ముందురోజు పైరసీను అరికట్టడంపై కొన్ని ఆర్డర్లను పాస్ చేసింది. ఈ విషయాలను తెలియజేయడానికి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ మెంబర్స్ శుక్రవారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసారు. ఈ సందర్భంగా..

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "బాహుబలి' రిలీజ్ నుండి ఇప్పటివరకు పైరసీ విషయంలో కొన్ని మార్పులొచ్చాయి. 'బాహుబలి' సినిమాను పైరసీ చేసిన ఓ ముఠాను పట్టుకోవడం జరిగింది. ఈ విషయంలో ప్రభుత్వం మాకు ఎంతగానో సహకరించింది. నిన్న సాయంత్రం సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని ఉత్తర్వులు జారీ చేసింది. పైరసీ చేసే వారిపై చర్యలు తీసుకోనున్నామని అందులో తెలియజేసారు. నిర్మాతలకు అండదండగా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ఎప్పటికీ ఉంటుంది" అని చెప్పారు.

రాజ్ కుమార్ మాట్లాడుతూ "బాహుబలి'ను ప్రియాంక్ అనే ఓ ప్రతిష్టాత్మకమైన సాఫ్ట్ వేర్ కంపెనీకు చెందిన వ్యక్తి పైరసీ చేసారని తెలిసింది. తనతో మరో ఇరవై మంది కలిసి వచ్చిన ప్రతి సినిమాను పైరసీ చేసి రిలీజ్ చేస్తున్నారు. వారందరిపై సివియర్ యాక్షన్స్ తీసుకోనున్నారు. ఈరోజు రిలీజ్ అయిన 'శ్రీమంతుడు' సినిమాను పైరసీ కాకుండా చూసుకుంటాం. చిన్న నిర్మాతలు, పెద్ద నిర్మాతలు అని లేకుండా ప్రతి ఒక్కరి విషయంలో జాగ్రత్తలు తీసుకుంటాం. ఇప్పుడు ప్రభుత్వం కూడా అందరికి తోడుగా నిలిచింది" అని చెప్పారు.

దిల్ రాజు మాట్లాడుతూ "బాహుబలి సినిమాకు వాటర్ మార్క్ ఇచ్చినా కూడా పైరసీ చేసారు. శ్రీమంతుడు విషయంలో అలా కాకుండా ప్రయత్నిస్తాం. ఏ థియేటర్లలో పైరసీ జరుగుతుందో అవన్నీ బ్యాన్ చేస్తాం. పైరసీ ను ఆపగలిగితే రిజల్ట్స్ బావుంటాయి. మంచి స్థాయిలో ఉన్నవారు పైరసీ లాంటి పనులు చేయడం సిగ్గుచేటు. ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ పైరసీ ను అరికట్టే దిశగా చర్యలు తీసుకుంటుంది" అని చెప్పారు. 

ఇంకా ఈ కార్యక్రమంలో ప్రథాని రామకృష్ణ గౌడ్, కొడాలి వెంకటేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ