Advertisementt

ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ ప్రధానోత్సవం!

Mon 03rd Aug 2015 04:01 AM
santhosham awards,suresh kondeti,naga sowrya,rasikhanna  ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ ప్రధానోత్సవం!
ఆగస్ట్ 21న సంతోషం అవార్డ్స్ ప్రధానోత్సవం!
Advertisement
Ads by CJ

ఏ ఏడాదికాఏడాది కనీవినీ ఎరుగని రీతిలో 'సంతోషం' వార్షికోత్సవ వేడుకలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. అయితే దక్షిణాది భాషలలోనే కాకుండా పదకొండు భారతీయ భాషలలోని సినీ ప్రముఖులకు పురస్కారాలను ప్రదానం చేస్తున్నారు. ఈ అవార్డుల ప్రధానోత్సవం శుక్రవారం హైదరాబాద్ లోని ఆగస్ట్ 21 న జరగనుందని "సంతోషం" అధినేత సురేష్ కొండేటి ఆదివారం వారి కుమార్తె పుట్టినరోజు సందర్భంగా విలేకర్ల సమావేశం ఏర్పాటు చేసి వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సంతోషం అవార్డ్స్ కు సంబంధించిన పోస్టర్ ను, ప్రమోషనల్ సాంగ్ ను, ట్రైలర్ ను విడుదల చేసారు. ఈ సందర్భంగా..

నిర్మాత దామోదర్ ప్రసాద్ మాట్లాడుతూ "ఓ మ్యాగజీన్ ను రన్ చేస్తూ అవార్డులు ప్రధానం చేయడమనేది చాలా కష్టమైన విషయం. అది కూడా 13 సంవత్సరాలుగా నిర్విరామంగా నిర్వహించడమనేది మామూలు విష్యం కాదు. అవార్డ్స్ అనేవి నటీనటులకు, సాంకేతికనిపుణులకు చాలా ముఖ్యమైనవి. వారికి చాలా ప్రోత్సాహాన్నిస్తాయి" అని చెప్పారు.

నెం.1 ఛానెల్ చైర్మన్ సాయి సుధాకర్ మాట్లాడుతూ "గత 13 సంవత్సరాలుగా దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సురేష్ కొండేటి గారిని అభినందిస్తున్నాను. ఈ సంవత్సరం జరుగుతున్న ఈ వేడుకలకు మీడియా పార్టనర్ గా వ్యవహరిస్తున్నందుకు సంతోషంగా ఉంది. సురేష్ గారికి మా ప్రోత్సాహం ఎప్పుడు ఉంటుంది" అని చెప్పారు.

సింధురపువ్వు కృష్ణారెడ్డి మాట్లాడుతూ "ఆగస్ట్ 21న ఈ అవార్డు కార్యక్రమం నిర్వహించనున్నారు. సౌత్ ఇండియాలో నాలుగు భాషలకు చెందిన నటీనటులకు, టెక్నీషియన్స్ కు అవార్డ్స్ ఇవ్వడం చాలా గొప్ప విషయం. ఈ కార్యక్రమం మంచి సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

నాగశౌర్య మాట్లాడుతూ "సంతోషం అవార్డ్స్ అనే కార్యక్రమం నిర్వహిస్తూ అందరిలో సంతోషాన్ని నింపుతున్నారు. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని జరగాలని కోరుకుంటున్నాను" అని చెప్పారు.

సురేష్ కొండేటి మాట్లాడుతూ "గత 13 సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని సక్సెస్ చేస్తున్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. ఈ సంవత్సరం నెం.1 ఛానెల్ మాతో అసోసియేట్ అవ్వడం సంతోషంగా ఉంది. ప్రతి సంవత్సరంలాగానే ఈ సంవత్సరం కూడా ఈ కార్యక్రమాన్ని దిగ్విజం చేస్తారాన్ని ఆశిస్తున్నాను" అని చెప్పారు.

ఈ కార్యక్రమంలో హీరో నాగాన్వేష్, రాశిఖన్నా, శ్యామల, జెమిని సురేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ