Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- మహేష్ బాబు

Sun 02nd Aug 2015 04:15 AM
maheshbabu,koratala siva,sreemanthudu,sruthihassan  సినీజోష్ ఇంటర్వ్యూ- మహేష్ బాబు
సినీజోష్ ఇంటర్వ్యూ- మహేష్ బాబు
Advertisement
Ads by CJ

దూకుడు, సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు వంటి సూపర్ హిట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మహేష్ బాబు తాజాగా కొరటాల శివ దర్శకత్వంలో 'శ్రీమంతుడు' వంటి ఫ్యామిలీ, యాక్షన్ ఎంటర్ టైనర్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని ఆగస్ట్ 7న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో మహేష్ బాబుతో సినీజోష్ ఇంటర్వ్యూ..

'శ్రీమంతుడు' టైటిల్ జస్టిఫికేషన్ ఏంటి..?

కొరటాల శివ గారు నాకు మొదటిసారి కథ చెప్పినపుడు వెంటనే ఓకే చేసేసాను. స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమా ఇది. కథకు 'శ్రీమంతుడు' టైటిల్ అయితే యాప్ట్ అవుతుందని శివ గారు అనుకొని సినిమా ఫస్ట్ షెడ్యూల్ పూర్తయిన తరువాత నాకు చెప్పారు. అందరికి నచ్చడంతో శ్రీమంతుడు టైటిల్ ను కన్ఫర్మ్ చేసారు. సినిమాలో అన్ని ఎమోషన్స్ ఉంటాయి. కంప్లీట్ ఎంటర్టైనింగ్ మూవీ. ఇంత మంచి కంటెంట్ ఉన్న సినిమా ప్రేక్షకులకు రీచ్ అవ్వాలని భావిస్తున్నాను.

కో ప్రొడ్యూసర్ గా మారడానికి కారణం..?

మా కుటుంబంలో అందరు చాలా చిత్రాలకు కో ప్రొడ్యూసర్స్ గా చేసారు. ఇప్పటివరకు అక్క, అన్నయ్య పేర్లు మాత్రమే ఆ లిస్టులో ఇన్వాల్వ్  అయ్యాయి. ఇప్పుడు నా పేరు ఇన్వాల్వ్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది. 

ఈ సినిమాలో ప్రత్యేకంగా డాన్స్ పై ఎక్కువగా శ్రద్ధ పెట్టినట్లున్నారు.. నిజమేనా?

ప్రతి సినిమాలో డాన్స్ విషయంలో నా బెస్ట్ నేను ఇస్తాను. ఈ సినిమాలో డాన్స్ విషయంలో శివ గారు, రాజు సుందరం గారు నాకు చాలా హెల్ప్ చేసారు. వారి వలనే అవుట్ పుట్ బాగా వచ్చింది. ముఖ్యంగా 'చారుశీల' సాంగ్ చేసినప్పుడు చాలా ఎంజాయ్ చేసి చేసాను. మనం వర్క్ ను ఎంజాయ్ చేస్తూ చేస్తే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి.

ప్రయోగాత్మక చిత్రాల్లో నటించడంపై మీ అభిప్రాయం ఏంటి..?

నా కెరీర్ లో 'టక్కరి దొంగ' , 'నాని' , '1 నేనొక్కడినే' వంటి ప్రోయోగాత్మక చిత్రాల్లో నటించాను. కాని అవి వర్కవుట్ కాలేదు. దానికి కారణాలు నా పెర్ఫార్మన్స్ కాని కథ కాని ఏదైనా కావచ్చు. ప్రస్తుతం సినిమాలన్నీ భారీ ప్రాజెక్ట్స్ తో తెరకెక్కిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఎక్స్ పెరిమెంటల్ సినిమాలలో నటించినా వాటిలో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటే మంచి రిజల్ట్స్ వస్తాయి. కథ ఫ్రెష్ గా ఉంటే నేను ఖచ్చితంగా నటిస్తాను కాని నా మిస్టేక్స్ రిపీట్ అవ్వకుండా చూసుకుంటాను.

జగపతి బాబు గారి రోల్ గురించి..?

పర్టిక్యులర్ గా జగపతిబాబు గారి రోల్ కోసం స్టేచర్ ఉన్న పర్సన్ కావాలి. ఆ పాత్రలో ఆయన సూట్ అవుతారని మేమంతా ఫీల్ అయ్యాం. కాని ఒప్పుకుంటారో లేదో అని ఆయనని అడగడానికి భయపడ్డాం. కథ నేరేట్ చేయగానే నటించడానికి ఓకే చెప్పారు. హీరో ఫాదర్ క్యారెక్టర్ అధ్బుతంగా నటించారు.

శ్రుతిహాసన్ తో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?

శ్రుతిహాసన్ టెర్రిఫిక్ పెర్ఫార్మర్. మల్టీ టాలెంటెడ్. ఈ సినిమాలో తన బెస్ట్ పెర్ఫార్మన్స్ ఇచ్చింది.

డైరెక్టర్ కొరటాల శివ గురించి..?

తెలుగు ఇండస్ట్రీలో ఆయనొక మంచి రచయిత. 'శ్రీమంతుడు' కూడా గొప్ప స్క్రిప్ట్. ఆయన నాకు ఏ కథనైతే నేరేట్ చేసారో అంతకంటే బాగా స్క్రీన్ మీద చూపించారు. మంచి సత్తా ఉన్న దర్శకుడు.

ప్రొడ్యూసర్స్ గురించి..?

ఈ చిత్ర నిర్మాతలు పెద్ద డిస్ట్రిబ్యూటర్స్.  ఫారెన్ లో సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. వారు ఎప్పటినుండో సినిమాను నిర్మించాలనే యాంబిషన్ తో ఉన్నారు. ఈ సినిమాను మొదటిసారి ప్రొడ్యూస్ చేసినా చాలా అనుభవం ఉన్న ప్రొడ్యూసర్స్ లా పని చేసారు. ఎక్కడా కాంప్రమైస్ అవ్వకుండా చిత్రాన్ని తెరకెక్కించారు.

ఈ సినిమాకు తమిళంలో మీరే డబ్బింగ్ చెప్పారా..?

ఇదొక యూనివర్సల్ సబ్జెక్ట్. అందరికి రీచ్ అవ్వాలనే ఉద్దేశ్యంతో మా కెమెరామెన్ ఈ సినిమాను తమిళంలో కూడా రిలీజ్ చేద్దామని సజెస్ట్ చేసారు. అందుకే రెండు భాషల్లో ఒకేసారి రిలీజ్ చేస్తున్నాం. నేను తమిల్ బాగా మాట్లాడగలను. కాని డబ్బింగ్ చెప్పడానికి టైం దొరకలేదు. అందుకే చెప్పలేకపోయాను.

భజరంగీ బాయ్ జాన్, పికె వంటి స్ట్రాంగ్ కంటెంట్ ఉన్న సినిమాలు తెలుగులో వస్తాయంటారా..?

ఆ విష్యం మన రచయితల్ని, డైరెక్టర్స్ ను అడగాల్సిందే. బాలీవుడ్ లో వచ్చిన ఆ రెండు చిత్రాల కథలు చాలా ఫ్రెష్ గా ఉంటాయి. అలాంటి స్క్రిప్ట్స్ నాకు ఎవరైనా చెప్తే ఖచ్చితంగా నటిస్తాను.

మీ నాన్నగారు మహేష్ జేమ్స్ బాండ్ చిత్రాల్లో నటిస్తే బావుంటుందని అన్నారు. దానిపై మీ స్పందన?

నాన్నగారికి నేనెప్పుడు కొత్త తరహా ఉన్న పాత్రల్లో నటిస్తే చాలా ఇష్టం. ఆయన ఆశించినట్లుగానే జేమ్స్ బాండ్ లాంటి పాత్రల్లో నటించే అవకాసం వస్తే డెఫినిట్ గా చేస్తాను. 

అల్లూరి సీతారామరాజు చిత్రాన్ని రీమేక్ చేస్తారా..?

నాన్నగారు నటించిన అల్లూరి సీతారామరాజు ఓ క్లాసిక్ మూవీ. అది నాకు బైబుల్ లాంటిది. ఆ చిత్రాన్ని రీమేక్ చేసి ఆలోచన లేదు.

బాలీవుడ్ కు వెళ్ళే ఆలోచనలు ఏమైనా ఉన్నాయా..?

ముందుగా నాకు బాలీవుడ్ చిత్రాల్లో నటించే సమయం లేదు. శ్రీమంతుడు చేయడానికి నాకు ఎనిమిది నెలలు పట్టింది. దీని తరువాత వెంటనే బ్రహ్మోత్సవం సినిమా ఉంది. దానికి మరొక ఎనిమిది నెలలు పడుతుంది. దీనికి మధ్యలో నేను గ్యాప్ తీసుకొని బాలీవుడ్ సినిమాలో నటిస్తే తెలుగులో నా సినిమా రిలీజ్ అవ్వడానికి కనీసం మూడు సంవత్సరాలు పడుతుంది. అందుకే అక్కడ సినిమాలు చేయాలనుకోవట్లేదు అంటూ ఇంటర్వ్యూ ముగించారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ