Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- అభిజీత్(మిర్చిలాంటి కుర్రాడు)

Thu 30th Jul 2015 10:56 AM
abhijeeth,mirchilanti kurrollu,jayanagh,rudhrapati ramanarao  సినీజోష్ ఇంటర్వ్యూ- అభిజీత్(మిర్చిలాంటి కుర్రాడు)
సినీజోష్ ఇంటర్వ్యూ- అభిజీత్(మిర్చిలాంటి కుర్రాడు)
Advertisement
Ads by CJ

'లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్' చిత్రంతో తెలుగు ఇండస్ట్రీకు పరిచయమయిన హీరో అభిజీత్. రామ్ లీల చిత్రంలో గెస్ట్ రోల్ లో నటించిన అభిజీత్ ప్రస్తుతం జయనాగ్ దర్శకత్వంలో రుద్రపాటి రమణారావు నిర్మించిన 'మిర్చిలాంటి కుర్రాడు' చిత్రంలో హీరోగా నటించాడు. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 31న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో అభిజీత్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాలో మీ పాత్ర గురించి..?

నా పాత్ర పేరు సిద్ధు. మంచి వాళ్ళకు హెల్ప్ చేస్తూ తప్పు చేస్తే ఊరుకొని క్యారెక్టర్ అది. అలాంటి అబ్బాయి ఓ అమ్మాయిని చూసి ఇష్టపడతాడు. అనుకోకుండా వారిద్దరి మధ్య ఓ గొడవ జరుగుతుంది. హీరో తన లవ్ ను సక్సెస్ చేసుకొని ప్రేమించిన అమ్మాయి ఇంట్లో ఎలా ఒప్పించుకున్నాడనేదే ఈ సినిమా.

సినిమాలో హైలైట్స్..?

ఇదొక కమర్షియల్ ఎంటర్టైనింగ్ మూవీ. కామెడీ రొమాన్స్, కొంచెం యాక్షన్ ప్రేక్షకులకు నచ్చే ప్రతి ఎలిమెంట్ ఈ సినిమాలో ఉంటుంది. నిజానికి ఈ చిత్రం లవ్ స్టొరీ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అవుతుది.

ఈ సినిమాలో అవకాసం ఎలా వచ్చింది..?

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమా తరువాత నేను మళ్ళీ అమెరికా వెళ్ళిపోయాను. అసలు సినిమాలలో నటించాలని కాని యాక్టర్ అవ్వాలని కాని నేనెప్పుడు అనుకోలేదు. నటిస్తే మాత్రం మంచి చిత్రాల్లో నటించాలనుకున్నాను. నా మొదటి సినిమా కూడా శేఖర్ కమ్ముల లాంటి మంచి దర్సకునితో పని చేసాను. ఆ పేరు నిలబెట్టుకోవాలనుకున్నాను. 'మిర్చిలాంటి కుర్రాడు' చిత్రంలో హీరోగా నేను సూట్ అవుతానని డైరెక్టర్ గారు నన్ను 'యు.ఎస్' నుంచి పిలిపించారు.

ఈ చిత్రంలో సిక్స్ ప్యాక్ లో కనిపిస్తున్నారా..?

నిజంగా సినిమా డిమాండ్ చేస్తే సిక్స్ ప్యాక్ లో కనిపించొచ్చు. కాని ఈ సినిమాలో నాది అలాంటి రోల్ కాదు. అయితే సినిమాల్లోకి రాకముందు సిక్స్ ప్యాక్ తో నాకు కొన్ని ఫోటో షూట్స్ జరిగాయి. రీసెంట్ గా అవి రివీల్ అయ్యాయి. అంతే కాని ఈ సినిమాలో నేను సిక్స్ ప్యాక్ తో కనిపించట్లేదు.

ఈ సినిమా అన్ని రకాలా ఆడియన్స్ కు కనెక్ట్ అవుతుందా..?

ఏ సినిమా అయినా ఒక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ అయితే మరొక సెట్ ఆఫ్ ఆడియన్స్ కు కనెక్ట్ కాదు. కాని ఈ చిత్రం  అందరికి నచ్చాలని నేను బ్యాలన్స్డ్ గా నటించాను. సినిమాలో డిఫరెంట్ మాస్ షేడ్స్ ఉంటాయి.

డైరెక్టర్ గారి గురించి..?

జయనాగ్ గారు రాజమౌళి గారి దగ్గర అసోసియేట్ డైరెక్టర్ గా పనిచేసారు. ఈ సినిమా స్క్రిప్ట్ రాసుకొని నాకు వినిపించాక చాలా నచ్చింది. కమర్షియల్ సినిమా చేయాలనే ఉద్దేశ్యంతో ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. బాగా డైరెక్ట్ చేసారు.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

ఇప్పటివరకు ఏది కన్ఫర్మ్ కాలేదు. ఏ సినిమా చేయలన్నా ఈ సినిమా రిజల్ట్ పై ఆధారపడి ఉంటుది.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ