Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- చేతన్ చీను

Wed 29th Jul 2015 08:50 AM
chethan cheenu,mantra2,charmi,rajugari gadi  సినీజోష్ ఇంటర్వ్యూ- చేతన్ చీను
సినీజోష్ ఇంటర్వ్యూ- చేతన్ చీను
Advertisement

చార్మి, చేతన్ ప్రధాన పాత్రలో శ్రీనివాస్ నాయుడు చామకుర్తి సమర్పణలో గ్రీన్ మూవీస్ బ్యానర్ పతాకంపై ఎస్.వి.సతీష్ దర్శకత్వంలో శౌరి రెడ్డి, యాదగిరి రెడ్డి సంయుక్తంగా నిర్మించిన సినిమా 'మంత్ర2'. ఈ చిత్రంలో నటించిన చేతన్ తన సినీ ప్రయాణం గురించి విలేకర్లతో ముచ్చటించారు. 

మణిరత్నం గారి సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యాను..

నేను పుట్టి, పెరిగింది ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురంలో. నా చదువు కోసం ఫ్యామిలీ అంతా చెన్నై షిఫ్ట్ అయ్యాం. అక్కడే బి.కామ్ కంప్లీట్ చేశాను. నాకు ఫిలిం బ్యాక్ గ్రౌండ్ లేదు. చిన్నప్పుడు మణిరత్నం గారు తెరకెక్కించిన 'అంజలి' చిత్రంతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇంట్రడ్యూస్ అయ్యాను. డైరెక్టర్ పి.వాసు గారు తమిళంలో నన్ను నటునిగా పరిచయం చేసారు. తమిళంలో నాలుగు చిత్రాలలో నటించాను. తమిళంలో దర్శకుడు జెమిని గారు తెరకెక్కించిన బయోపిక్ సినిమాలో హీరోగా నటించాను.

హారర్ జోనర్ చిత్రంతో ఎందుకు ఇంట్రడ్యూస్ కాకూడదు అనుకున్నా..

నేను పక్కా తెలుగువాడిని. మంచి తెలుగు చిత్రంతో ఇండస్ట్రీకు పరిచయం కావాలనుకున్నాను. చిన్నప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి కూచిపూడి డాన్స్ నేర్చుకున్నాను. బొంబాయిలో నటనలో ఆరునెలలు కోచింగ్ తీసుకొని మోడలింగ్, చాలా యాడ్స్ లో నటించాను. ఆ సమయంలో కె.ఎస్. రామారావు గారి దగ్గర నుండి ఫోన్ వచ్చింది. మంత్ర2 సినిమాలో హీరోగా నటించమని అడిగారు. నేను చెన్నైలో ఉన్నప్పుడు మంత్ర సినిమా చూసాను. హారర్ జోనర్ లో మొదటిసారి వచ్చిన సినిమా. నాకు చాలా నచ్చింది. మొదటిసారి హీరోగా అంటే ఎవరైనా కమర్షియల్, క్యూట్ లవ్ స్టొరీ కథలతో పరిచయం కావాలనుకుంటారు. కాని హారర్ జోనర్ సినిమాతో ఎందుకు ఇంట్రడ్యూస్ కాకూడదు అనుకున్నాను. అందుకే ఈ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నాను.

పోలీస్ పాత్రలో కనిపిస్తున్నా..

హీరోగా రెండు మూడు చిత్రాలు చేసిన తరువాత ఎవరికైనా పోలీస్ పాత్రలో నటించే అవకాసం వస్తుంది. కానీ నాకు మొదటి చిత్రంలోనే కాప్ క్యారెక్టర్ లో నటించే చాన్స్ వచ్చింది. మంత్ర2 లో నా పాత్ర పేరు విజయ్. చార్మి గారు ఒక సమస్యలో ఉంటే దానిని పరిష్కరించి ఇద్దరం ఎలా బయట పడ్డామనేదే మెయిన్ పాయింట్. థ్రిల్లర్ అంశాలతో సాగే ఈ చిత్రాన్ని ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా డైరెక్టర్ గారు తెరకెక్కించారు.

చార్మి గారు చాలా హెల్ప్ చేసారు..

చార్మి గారు వెరీ స్వీట్ పర్సన్. ఎంత ఎదిగినా ఒదిగి ఉండే మనస్తత్వం గల మనిషి. ఈ సినిమాలో నా క్యారెక్టర్ ఎలా ఉంటో బావుంటుంది అనే విషయంలో ఆవిడ చాలా హెల్ప్ చేసారు. సెట్స్ లో నాకు చాలా సజెషన్స్ ఇచ్చేవారు. 

రఘువరన్ గారే నా ఇన్స్పిరేషన్..

ఓ నటునిగా మంచి పేరు తెచ్చుకోవాలని రఘువరన్ గారిని చూసి అనుకునేవాడిని. హీరోగా, విలన్ గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ప్రతి పాత్రలో ఒదిగిపోయి నటించేవారు. ఆయన తరువాత ప్రకాష్ రాజు గారి నటన బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసింది. తెలుగులో పవన్ కళ్యాన్, తమిళంలో అజిత్ గారు నా ఫేవరెట్ హీరోస్.

డ్రీమ్ ప్రాజెక్ట్..

మంత్ర2 సినిమాకి పని చేసిన సాగర్ అనే అసోసియేట్ డైరెక్టర్ నాకొక స్టొరీ చెప్పారు. చాలా నచ్చింది. ఆయన కరుణాకరన్ గారి దగ్గర కూడా వర్క్ చేసారు. ఆయన చెప్పిన కథలో రెండు డిఫరెంట్ షేడ్స్ లో కనిపించనున్నాను. ఆగస్ట్ నెల నుండి ఆ సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది.

తెలుగులో నాలుగు ఫిల్మ్స్ కమిట్ అయ్యాను..

తెలుగులో ఐదుగురు హీరోయిన్స్ తో ఓ పెద్ద బ్యానర్ లో సినిమా చేయబోతున్నాను. త్వరలోనే అఫీషియల్ అనౌన్స్ మెంట్ చేస్తాం. ఓంకార్ దర్శకత్వంలో 'రాజుగారి గది' చిత్రంలో నటించాను. సినిమా బాగా వచ్చింది. అవి కాకుండా సెరోస్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై వస్తున్న మరో చిత్రంలో నటిస్తున్నాను. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement