భారతావనికి అశేష సేవలందించిన అబ్దుల్‌కలాం మృతి భారతీయులందర్నీ కలిచివేసింది. రాష్ట్రపతి, ప్రధానిసహా అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులు, మంత్రులు అబ్దుల్ కలాం మృతిపై సంతాపం వ్యక్తం చేశారు. కేంద్రం వారం రోజులపాటు సంతాప దినాలుగా ప్రకటించింది. అబ్దుల్ కలాం మృతిపై మన దేశమే కాకుండా ఐక్యరాజ్యసమితి కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేసింది. కలాం పుట్టిన రోజు అక్టోబర్ 15ను అంతర్జాతీయ విద్యా దినంగా ప్రకటించింది. ఇది అత్యంత అరుదైన గౌరవంగా భావించవచ్చు. ఇక మంగళవారం సాయంత్రం జనసేన అధినేత పవన్‌కల్యాణ్ కూడా కలాం మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తూ మీడియాకు ప్రకటన విడుదల చేశారు.
సాధారణంగా అన్ని విషయాలపై పవన్‌కల్యాణ్ చాలా ఆచితూచి స్పందిస్తారు. దీంతో పవన్ చాలా ఆలస్యంగా స్పందిస్తారన్న అపవాదు కూడా ఉంది. ఇక అబ్దుల్ కలాం సోమవారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో మృతిచెందారు. దీనిపై పవన్ కల్యాణ్ 24 గంటలు ఆలస్యంగా స్పందించడం ఆ అపవాదుకు మరింత బలం చేకూర్చింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లోని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలాం మృతిపై సోమవారం రాత్రి తీవ్ర సంతాపం వ్యక్తం చేశాయి. ఇతర విషయాల్లో పవన్ లేటుగా స్పందించినా అర్థం చేసుకోవచ్చు. కాని కలాంలాంటి అత్యున్నత వ్యక్తి మరణించిన సందర్భంలో కూడా పవన్ తన ధోరణి మార్చకోకపోవడం శోచనీయం.