సినీ ప్రముఖుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగిన సినీ 'మా' అవార్డ్ 2015
అపూర్వమైన కలయికకు సినీ 'మా' అవార్డ్స్ వేదికైంది. తెలుగు సినీ జగత్తులో నటుడిగా 50 వసంతాలను పూర్తి చేసుకున్న సూపర్‌స్టార్ కృష్ణకి 'మా' టీవీవారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుని అందజేసింది. అంతే కాకుండా నాటి సూపర్‌స్టార్ కృష్ణ తన చేతుల మీదుగా నేటి సూపర్‌స్టార్ మహేష్‌బాబుకి బెస్ట్ యాక్టర్ అవార్డుని అందించడంతో పాటు మనవడు గౌతమ్‌కి బెస్ట్ సెన్సేషనల్ అప్పియరెన్స్ అవార్డుని కూడా అందించడం విశేషం. ఈ విశేషాలన్నింటికీ 'మా' అవార్డుల కార్యక్రమం వేదికైంది.
తేనె మనసులు చిత్రంతో హీరోగా తెరంగేట్రం చేసిన హీరో కృష్ణ 350 సినిమాలకు పైగా నటించడమే కాకుండా తెలుగు సినిమాని సరికొత్త పుంతలు తొక్కించారు. కొత్త టెక్నాలజీని టాలీవుడ్‌కి పరిచయం చేయడమే కాకుండా నటుడిగా అనేక విభిన్నమైన పాత్రలతో మెప్పించి సూపర్‌స్టార్ కృష్ణగా తిరుగులేని అభిమాన గణాన్ని సంపాదిచుకున్నారు. ఆయన తెలుగు సినిమా రంగానికి చేసిన సేవకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుని అందించడంతో పాటు కార్యక్రమంలో పాల్గొన్న అతిథులందరూ అయన్ని సన్మానించారు. ఈ సన్మాన కార్యక్రమంలో ఆయన కుటుంబ సభ్యులందరూ పాల్గొనడం విశేషం.
ఇన్ని చిత్ర విశేషాలను అందించిన ఘనతను మాటీవీవారు సొంతం చేసుకున్నారు.
ఆహ్లాదకరమైన వాతావరణంలో 'మా' టీవీ అవార్డుల వేడుక అత్యంత అద్భుతంగా అంగరంగ వైభవంగా జరిగింది. తారాతోరణం కన్నుల పండుగగా కొలువుదీరిన ఈ మహోత్సవంలో అతిథులు ఆనందం, విజేతల మహదానందం అంబరాన్ని తాకింది. అందరినీ అలరించిన ప్రత్యేకమైన కార్యక్రమాల జోరు, చూసేవారి హోరు, హాలంతా ఒకటే హుషారు. టెలివిజన్ రంగంలో 'మా' టీవీ సరికొత్త సంచనాలకు తెరతీస్తూ ఎంటర్‌టైనింగ్ చానెల్‌గా ప్రేక్షకులను అలరిస్తూ అగ్ర పథాన దూసుకెళ్తుంది. ప్రతి ఏటా సినిమా రంగానికి చెందిన కళాకారులకు అవార్డులను అందిస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే ఈ సినీ 'మా' అవార్డ్స్ 2015 కార్యక్రమం హైదరాబాద్‌లోని నోవాటెల్ హెటల్‌లో జరిగింది. ఇదే వేదికపై అనేక చిత్రాల్లో విలన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, కమెడియన్‌గా అనేక పాత్రల్లో మెప్పించి కేంద్ర ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డుని పొందిన విలక్ష్షణ నటుడు కోట శ్రీనివాసరావుకి అతిథుల సమక్షంలో సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో...
సూపర్‌స్టార్ కృష్ణ మాట్లాడుతూ ''నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా దర్శకులు, నిర్మాతలు, ప్రేక్షకులు, అభిమానులు. ఇన్నేళ్లు నాకు సహకారం అందించిన ప్రతి ఒక్కరికి, నాకు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుని అందించిన మా టీవీవారికి నా ధన్యవాదాలు'' అన్నారు.
శ్రీమతి విజయనిర్మల మాట్లాడుతూ ''కృష్ణగారు నిర్మాతల శ్రేయస్సు కోరే హీరో. తను సినిమా చేసిన ఏ నిర్మాత అయినా ఇబ్బందుల్లో ఉంటే డబ్బు గురించి ఇబ్బంది పెట్టేవారు కాదు. డబ్బింగ్ పూర్తి చేసి సినిమాని రిలీజ్ చేసుకోమనేవారు. ఆయనకి మా టీవీవారు లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు రావడం ఆనందంగా ఉంది'' అన్నారు.
సూపర్‌స్టార్ మహేష్ మాట్లాడుతూ ''ఈ రోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. ఇప్పటి వరకు నాన్న చేతి నుండి ఏ అవార్డు తీసుకోలేదు. ఇదే ఫస్ట్ టైమ్. నా కెరీర్‌లో 'నేనొక్కడినే' వన్ ఆఫ్ ది బెస్ట్ పెర్‌ఫార్మెన్స్ మూవీ. అంత మంచి సినిమాని నాతో చేసిన సుకుమార్, 14 రీల్స్ బ్యానర్ వారికి థాంక్స్'' అన్నారు.
దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు మాట్లాడుతూ ''కృష్ణ నిజమైన స్నేహితుడు. ఆయన్ను హీరో అనడం కంటే గొప్పవ్యక్తి అనవచ్చు. ఎందుకంటే సినిమా రంగానికి ఆయన చేసిన సేవలు మరచిపోలేనివి. సినిమాల్లో ఆయన వేయని వేషం లేదు, చేయని సాహసం లేదు. అంతే కాకుండా ఈ జనరేషన్‌లో మహేష్‌లాంటి వజ్రాన్ని కానుకగా ఇచ్చాడు. ఆయనకి కంగ్రాట్స్'' అన్నారు.
అక్కినేని నాగార్జున మాట్లాడుతూ ''కృష్ణగారితో నేను రెండు సినిమాల్లో నటించాను. ఆయనకేదైనా కొత్త ఆలోచన వస్తే వెంటనే అమలుచేసేవారు. అదే మాకందరికీ ఇన్‌స్పిరేషన్. ఆయన అందరినీ నవ్వుతూనే పలకరిస్తారు.'మనం' సినిమా మా ఫ్యామిలీకి ఎప్పుడూ ఎమోషన్ సినిమానే. నాన్నగారు నటించిన అఖరి చిత్రమిది. ఆయన ఈ సినిమా చూడలేకపోయారనే బాధ మాకు ఉన్నప్పటికీ ఆయన సినిమా చూసి ఆనందించి మమల్ని మెచ్చుకుని ఉంటారని అనుకుంటున్నాం'' అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ''ఒకప్పుడు లార్జెస్ట్ ఫిలం, బిగ్గెస్ట్ ప్రొడక్షన్ హౌస్ అంటే మాకు కృష్ణగారే గుర్తుకు వస్తారు. చాలా పాజిటివ్ తత్వమున్న వ్యక్తి. ఏన్నో సాహసాలు చేసి మాకందరికీ ఇన్‌స్పిరేషన్‌గా నిలిచారు'' అన్నారు.
స్టైలిష్ స్టార్ అల్లుఅర్జున్ మాట్లాడుతూ ''నాకు అవార్డు రావడానికి ప్రధాన కారణం సురేందర్‌రెడ్డిగారు. నాతో పాటు పనిచేసిన నటీనటులు, టెక్నిషియన్స్‌కి థాంక్స్. ఈ అవార్డుని మూవీ మొఘల్ డి.రామానాయుడుగారికి డేడికేట్ చేస్తున్నాను. ఇంతకు ముందు ఫిలింఫేర్ అవార్డుని అక్కినేని నాగేశ్వరరావుగారికి డేడికేట్ చేశాను. ఎందుకిలా చేస్తున్నానని అనుకోవచ్చు. ఇండస్ట్రీ ఈరోజు ఇలా ఉన్నదంటే కారణం అటువంటి గొప్పవాళ్లే. వారు లేనప్పుడే వారి విలువ తెలుస్తుంది'' అన్నారు.
మాటీవీ ఛైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్ మాట్లాడుతూ ''మేం చిన్నప్పుడు ఉంటున్న ఇంటి దగ్గర్లోనే అల్లూరిసీతారామరాజు సినిమా ఆడే థియేటర్ ఉండేది. ఆ సినిమా డైలాగ్స్ వినేవాడిని. ఈరోజు ఈ వేదికపై ఆయన్ని సన్మానించడం ఆనందంగా ఉంది'' అన్నారు.
కళా తపస్వి కె.విశ్వనాథ్ మాట్లాడుతూ ''తేనె మనసులు సినిమా టైమ్‌లో కృష్ణగారితో చేసిన జర్నీని మరచిపోలేం. తనని కృష్ణగారు అనడం కంటే కృష్ణ అనడం నాకు ఇష్టం. తనకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డుని ఇచ్చిన మా టీవీ యాజమాన్యానికి థాంక్స్'' అన్నారు
సహజనటి జయసుధ మాట్లాడుతూ ''కృష్ణగారు ఎన్నో లైఫ్ టైమ్ అవార్డులు అందుకున్నారు. అయితే అనేక మంది అతిథులతో పాటు ఆయన కుటుంబ సభ్యుల మధ్య ఈ లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డు అందుకోవడం ఆయనకు స్పెషల్. ధైర్యానికి, సాహసానికి ఆయన మరో పేరు'' అన్నారు.
జగపతి బాబు మాట్లాడుతూ ''ఇవాళ నిజంగా పండుగరోజు. నేను కృష్ణగారితో కలిసి ఒక సినిమా చేశాను. కల్మషం లేని వ్యక్తి. నేను ఇబ్బందుల్లో ఉన్నప్పుడు నిమ్మగడ్డ ప్రసాద్‌గారు అందించిన సహాయం మరచిపోలేను'' అన్నారు.
కోటశ్రీనివాసరావు మాట్లాడుతూ ''నా గురువులు, దర్శకులు, నిర్మాతలు, 35 ఏళ్లుగా ఆదరిస్తున్న ప్రేక్షకులకు థాంక్స్'' అన్నారు.
సినీ 'మా' అవార్డ్ 2015 విన్నర్స్
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (ఫిమేల్) - చిత్ర (ముకుంద)- (విరిసిన...)
బెస్ట్ ప్లే బ్యాక్ సింగర్ (మేల్) - అర్జిత్ సింగ్ - (మనం) -(కనిపెంచిన..)
బెస్ట్ ఎడిటర్ - గౌతంరాజు (రేసుగుర్రం)
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ - రాజీవన్ (మనం)
బెస్ట్‌యాక్టర్ (మేల్) జ్యూరీ - మహేష్ (నేనొక్కడినే)
బెస్ట్ యాక్టర్ (ఫిమేల్) జ్యూరీ - రకుల్ ప్రీత్ సింగ్ (లౌక్యం)
బెస్ట్‌యాక్టర్ (మేల్) (వోటింగ్) - అల్లు అర్జున్ (రేసుగుర్రం)
బెస్ట్‌యాక్టర్ (ఫిమేల్) (వోటింగ్) - సమంత (మనం)
బెస్ట్ సెన్సేషనల్ అప్పియరెన్స్ - మాస్టర్ గౌతమ్ (నేనొక్కడినే)
బెస్ట్ నెగటివ్ రోల్ - జగపతి బాబు(లెజెండ్)
బెస్ట్ స్టోరి - విక్రమ్ కె.కుమార్
బెస్ట్ లిరిసిస్ట్ - చంద్రబోస్ (మనం)- కనిపెంచిన.., (నేనొక్కడినే)
బెస్ట్ డైలాగ్స్ - రత్నం (లెజెండ్)
బెస్ట్ ప్రొమినెంట్ యాక్టర్ (మేల్) - మోహన్ బాబు (రౌడీ)
బెస్ట్ ప్రొమినెంట్ యాక్టర్ (ఫిమేల్) - జయసుధ
బెస్ట్ డెబ్యూ యాక్టర్ (మేల్) - సాయిధరమ్‌తేజ్
బెస్ట్ డెబ్యూ యాక్టర్ (ఫిమేల్) - రాశి ఖన్నా (ఉహలు గుసగుసలాడే)
బెస్ట్ సినిమాటోగ్రఫీ - పి.యస్.వినోద్ (మనం)
బెస్ట్ డెబ్యూ డైరెక్టర్ - కె.యస్.రవీంద్ర (పవర్)
బెస్ట్ కొరియోగ్రఫీ - జానీ (రేసుగుర్రం) - సినిమా చూపిస్త మావ....
బెస్ట్ ఫైట్ మాస్టర్ - రామ్ లక్ష్మణ్ (లెజెండ్)
బెస్ట్ ఎక్సెప్షనల్ పెర్‌ఫార్మెన్స్ - నాగార్జున (మనం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ జ్యూరీ- అనూప్ రూబెన్స్ (మనం)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్ 'వోటింగ్) - దేవిశ్రీ ప్రసాద్ (నేనొక్కడినే)
బెస్ట్ మూవీ జ్యూరీ - మనం
బెస్ట్ మూవీ (వోటింగ్) - రేసుగుర్రం
బెస్ట్ కామిక్ రోల్ - సంపూర్ణేష్ బాబు (హృదయ కాలేయం)
బెస్ట్ అప్రిసియేషన్ అవార్డ్స్
బెస్ట్ సోషల్ కాజ్ మూవీ - నా బంగారు తల్లి
బెస్ట్ ఇన్‌స్పిరేషన్ యాక్టర్ - అంజలి పాటిల్
స్పెషల్ అప్రిసియేషనల్ మూవీ - చందమామ కథలు
బెస్ట్ అప్రిసియేషన్ (కండెక్టింగ్ ప్రొగ్రామ్స్) - అలీ
హైలైట్స్
- అంజలి, రాశిఖన్నా, హంసానందిని, రెజీనా, లక్ష్మీరాయ్ డ్యాన్స్ పెర్‌ఫార్మెన్స్‌తో ఆకట్టుకున్నారు
- శంకర్ మహాదేవన్, కల్పన తమ పాటలతో శ్రోతలను ఊర్రుతలూగించారు
- సాయిధరమ్‌తేజ్ డ్యాన్స్ షో ప్రేక్షకులను ఆకట్టుకుంది. తొలిసారి సాయిధరవమ్ తేజ్ స్టేజ్ ఫెర్‌ఫార్మెన్స్ చేయడమే కాకుండా బెస్ట్ డెబ్యూ హీరో అవార్డుని తన తల్లి విజయ చేతుల మీదుగా అందుకోవడం విశేషం.
- మహేష్ తనయుడు మాస్టర్ గౌతమ్ నేనొక్కడినే సినిమాకిగానూ బెస్ట్ సెన్సేషనల్ అవార్డుని తన తాతయ్య సూపర్‌స్టార్ కృష్ణ చేతుల మీద అందుకోవడం విశేషం
- చేనేత కార్మికుల కోసం స్పెషల్ ర్యాంప్ వాక్‌ను నిర్వహించారు.
పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమం త్వరలోనే 'మా' టీవీలో ప్రసారం కానుంది.