Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- జేమ్స్ బాండ్ టీమ్

Wed 22nd Jul 2015 07:47 AM
james bond,allari naresh,sakshi chowdary,sai kishore maccha  సినీజోష్ ఇంటర్వ్యూ- జేమ్స్ బాండ్ టీమ్
సినీజోష్ ఇంటర్వ్యూ- జేమ్స్ బాండ్ టీమ్
Advertisement
Ads by CJ

ఏ టీవీ సమర్పణలో ఎ.కె.ఎంటర్‌టైన్మెంట్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్‌పై అల్లరి నరేష్‌, సాక్షిచౌదరి జంటగా మచ్చ సాయి కిషోర్‌ దర్శకత్వంలో రామబ్రహ్మం సుంకర రూపొందించిన చిత్రం ‘జేమ్స్‌బాండ్‌’. ఈ చిత్రం అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ నెల 24న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో అల్లరి నరేష్, హీరోయిన్ సాక్షి చౌదరి, దర్శకుడు సాయి కిషోర్ మచ్చ విలేకర్లతో ముచ్చటించారు. 

సినిమా గురించి అల్లరి నరేష్ మాట్లాడుతూ ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

ప్రతి భర్తకు తనకు కాబోయే భార్య చాలా సైలెంట్ గా, సాఫ్ట్ గా ఉండాలనుకుంటాడు. నాని అనే మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఓ సాఫ్ట్ వేర్ ఉద్యోగుడు కూడా అలాంటి భార్య కోసమే చూస్తాడు. కాని కొన్ని పరిస్థితుల్లో తను ఒక డాన్ ని పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందనేదే ఈ సినిమా. చాలా ఎంటర్టైనింగ్ గా సాగే చిత్రమిది. సినిమాపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాం. అందుకే అల్లరి ఈజ్ బ్యాక్ అనే ట్యాగ్ లైన్ పెట్టాం.

ఈ సినిమా కోసం ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు..?

ఈ మూవీలో ఎలాంటి స్పూఫ్స్ లేవు. నేను నటించిన బెండు అప్పారావు, ఆహనా పెళ్ళంట చిత్రాల తరువాత ఫ్యామిలీ, ఎమోషన్స్ బ్యాక్ డ్రాప్ లో వస్తున్న సినిమా ఇది. కామెడీ రాయడం అనేది చాలా కష్టమైన విష్యం. కామెడీ పంచ్ కోసం సన్నివేశాన్ని పొడిగిస్తుంటే ప్రేక్షకులు ఇష్టపడట్లేదు. అందుకే ఈ చిత్రంలో డైలాగ్స్ చాలా క్రిస్పి గా ప్రేక్షకులకు నచ్చే విధంగా ఉండేలా చూసుకున్నాం. ఈ సినిమాలో రైటర్స్ గా చాలా మంది పని చేసారు. నేను నటించిన చిత్రాలలో బెస్ట్ వెర్షన్ ఈ చిత్రమే. ఆడియన్స్ కు టచ్ అయ్యే ఎలిమెంట్స్ ఈ చిత్రంలో ఉన్నాయి. సాయి కార్తిక్ మ్యూజిక్ సినిమాకు పెద్ద ఎసెట్ అవుతుంది.

కామెడీ తప్ప వేరే జోనర్ లో నటించారా..?

'సుడిగాడు' చిత్రం తరువాత ప్రేక్షకులు నా నుంచి ఎక్కువ శాతం కామెడీను ఆశిస్తున్నారు. అలాంటి సమయంలో లడ్డుబాబు, యాక్షన్ 3డి వంటి ప్రయోగాత్మక చిత్రాలలో నటించాను. కేవలం ఆ రెండు చిత్రాల కోసం నాకు మూడు సంవత్సరాల సమయం పట్టింది. కాని ఆ రెండు చిత్రాలు అనుకున్న విజయాలను ఇవ్వలేకపోయాయి. ప్రతి ఆర్టిస్ట్ జీవితంలో అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ప్రస్తుతం నేను మాత్రం కామెడీ చిత్రాలలో మాత్రమే నటించాలని డిసైడ్ అయ్యాను. సీరియస్ జోనర్ లో ఉండే చిత్రాలలో నటించాలనుకోవట్లేదు. 

'జేమ్స్ బాండ్' టైటిల్ పెట్టాలనే ఆలోచన ఎలా వచ్చింది..?

మొదట ఈ సినిమా కోసం అబ్బాయి అక్కినేని అమ్మాయి నందమూరి అనే టైటిల్ అనుకున్నాం. కాని పెద్ద కుటుంబాలకు చెందిన పేర్లను వాడడం ఎందుకనే ఉద్దేశ్యంతో పెట్టలేదు. ఆ తరువాత భర్త బలి, అమ్మోరు, అనే టైటిల్స్ అనుకున్నాం. చివరగా 'జేమ్స్ బాండ్' అనే టైటిల్ ప్రేక్షకులకు త్వరగా రీచ్ అవుతుందని ఈ టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నాం.

హీరోయిన్ సాక్షి చౌదరి గురించి..?

సాక్షి హైట్ వలనే తనకి ఈ సినిమాలో ఆఫర్ వచ్చింది. తనదొక టామ్ బాయ్ క్యారెక్టర్. నాకంటే ఈ చిత్రం కోసం సాక్షి నే ఎక్కువ కష్టపడింది. చాలా బాగా పెర్ఫార్మ్ చేసింది. 

స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు మీ నాన్నగారు లేరనే లోటు కనిపిస్తుందా..?

మొదట నుండి నాన్నగారు నా స్క్రిప్ట్స్ విషయంలో ఇన్వాల్వ్ అయ్యేవారు కాదు. ఆయనకి కథలను చెప్పడానికి డైరెక్టర్స్ కాస్త భయపడేవారు. సో.. నా సినిమాల కథలన్నీ నేనే వింటాను. తండ్రిగా ఆయనని మిస్ అవుతున్నాను. 

బాహుబలి వంటి పెద్ద సినిమా రన్ అవుతున్న ఈ సమయంలో 'జేమ్స్ బాండ్' రిలీజ్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అనుకుంటున్నారు..?

నా కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ చిత్రంగా నిలిచిన 'కితకితలు' మూవీ పోకిరి, బంగారం సినిమాలు రిలీజ్ అయిన టైం లో విడుదలయ్యింది. ఏ సినిమాకు ఉండాల్సిన అభిమానులు వాటికున్నారు. 'బాహుబలి' తెలుగు ప్రేక్షకులు గర్వించదగ్గ సినిమా. ఆ చిత్రంలో నాకొక అవకాసం వస్తే బావుంటుందనుకున్నాను.  'బాహుబలి'తో మా చిత్రం పోటీ పడుతుందని నేను చెప్పట్లేదు. కాని ఎంటర్టైన్మెంట్ కోరుకునే ప్రేక్షకులు మా చిత్రాన్ని ఆదరిస్తారని భావిస్తున్నాను.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

సెప్టెంబర్ నుండి మోహన్ బాబు గారు, నేను కలిసి నటిస్తున్న 'మామ మంచు అల్లుడు కంచు' చిత్రం షూటింగ్ మొదలుకానుంది. అదొక మరాఠి ఫిలిం రీమేక్. ఆ చిత్రంలో మోహన్ బాబు గారికి నాకు మధ్య టామ్ అండ్ జెర్రీ లాంటి కామెడీ ఉంటుంది. ఇది కాకుండా 'విక్టరీ' అనే కన్నడ రీమేక్ మూవీలో నటించడానికి అంగీకరించాను.

సినిమా గురించి సాక్షి చౌదరి మాట్లాడుతూ..

ఈ సినిమాలో దుబాయ్ కు చెందిన టాప్ డాన్ క్యారెక్టర్ లో కనిపించనున్నాను. కొన్ని పరిస్థితుల్లో ఈ డాన్ కు ఓ అమాయకుడితో పెళ్లి జరుగుతుంది. ఆ తరువాత ఏం జరిగిందనేదే ఈ సినిమా. నరేష్, నేను సమానంగా ఈ సినిమా కోసం కష్టపడ్డాం. యాక్షన్ సన్నివేశాలలో, స్టంట్ సీన్స్ లో నటించినపుడు చాలా ఎంజాయ్ చేసాను. డైరెక్టర్ కు ఇది మొదటి సినిమా అయినా చాలా అనుభవం ఉన్న దర్శకునిలా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరిస్తారని, నాకు మంచి పేరోస్తుందని ఆశిస్తున్నాను. ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ ప్రాజెక్ట్ ఓకే చేసాను. అది కాకుండా తమిళ చిత్రంలో నటించాను. అది విడుదలకు సిద్ధంగా ఉంది.

దర్శకుడు సాయి కిషోర్ ఈ చిత్రం గురించి మాట్లాడుతూ..

2005 లో సినిమాలపై ప్యాషన్ తో ఇండస్ట్రీలో అడుగుపెట్టాను. అప్పటినుండి కో డైరెక్టర్ గా వై.వి.ఎస్.చౌదరి, శ్రీనువైట్ల గారి దగ్గర పని చేసాను. అనిల్ సుంకర గారు నరేష్ డేట్స్ ఉన్నాయి. తనకు సూట్ అయ్యే కథ ఏమైనా ఉందా అని అడగగానే స్టొరీ లైన్ చెప్పాను. నరేష్ కు చెప్పగానే నచ్చింది. స్టొరీ డెవలప్ చేసి కథను సిద్ధం చేసాను. ఈ చిత్రంలో కామెడీ మాత్రమే కాదు ఫైట్స్, ఫ్యామిలీ ఎమోషన్స్ అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. ఈ చిత్రాన్ని చూసిన వారిలో సాయి అన్ని రకాల సినిమాలు చేయగలడు అనే అభిప్రాయం కలుగుతుంది. టైటిల్ హీరోయిన్ పేరు మీదున్న సినిమా కథ అంతా హీరో మీదే ఆధారపడి ఉంటుంది. సినిమాలో సిట్యుయేషనల్ సాంగ్స్ మాత్రమే ఉంటాయి. ఈ సినిమా కోసం నరేష్, ప్రొడ్యూసర్ గారు నాకు ఎంతగానో సహకరించారు. ఎక్కడ కాంప్రమైస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని తెరకెక్కించాం.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ