తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికలు ఆదివారం హైదరాబాద్ లోని ఫిలిం ఛాంబర్ లో జరిగాయి. ఈ ఎన్నికల్లో డి.సురేష్ బాబు, దిల్ రాజు, సుధాకర్ రెడ్డి వర్గానికి చెందిన ప్రొగ్రెసివ్ ప్యానల్, నట్టికుమార్, టి.ప్రసన్న కుమార్ వర్గానికి చెందిన మన ప్యానల్ పోటీ పడ్డాయి. ఈ ఎన్నికలలో ఛాంబర్ అధ్యక్షునిగా డి.సురేష్ బాబు ఎన్నికయ్యారు. సురేష్ బాబు దొంగ వోట్లతో గెలిచాడని, తనది నిజమైన గెలుపు కాదని నట్టికుమార్ వెల్లడించారు. ఎన్నికల అనంతరం వచ్చిన ఫలితాలపై అసంతృప్తి చెందిన నట్టికుమార్ మంగళవారం హైదరాబద్ లోని ఫిలిం ఛాంబర్ లో ప్రెస్ మీట్ ను నిర్వహించి తన ఆవేదన వ్యక్తం చేసాడు. ఈ సందర్భంగా..
నట్టికుమార్ మాట్లాడుతూ "జూలై 19వ తారీఖు జరిగిన ఛాంబర్ ఎన్నికల్లో సురేష్ బాబు కు చెందిన ప్రొగ్రెసివ్ ప్యానల్, మా ప్యానల్ కౌన్సిల్ కు సంబంధించిన నాలుగు విభాగాలో పోటీ పడ్డాం. ఆంధ్రప్రదేశ్ నుంచి 3000 మంది వోటర్లు రావాలి కాని 1400 మంది మాత్రమే వారి వోటు హక్కు వినియోగించుకున్నారు. 20 సంవత్సరాల ఇండస్ట్రీలో ఇప్పటివరకు ఎగ్జిబిటర్స్ కు ఎన్నికలనేవే జరగలేదు. మొదటిసారిగా ఈ ఎలక్షన్స్ లో ఎగ్జిబిటర్స్ కు ఎన్నికలు జరిగాయి. 240 ఎగ్జిబిటర్ వోట్లకు మా టీం కు 130 వోట్లను వేసి మూడు స్థానాల్లో మమ్మల్ని గెలిపించారు. 1200 థియేటర్లు ఉన్న సురేష్ బాబు మొత్తం ఎగ్జిబిటర్స్ కు సంబంధించిన స్థానాలను కైవసం చేసుకోలేకపోయాడు. ప్రతి విభాగంలో కేవలం ఆరు నుండి ఎనిమిది వోట్ల తేడాతో మాత్రమే వారు నెగ్గగలిగారు. ఇది నిజమియన్ గెలుపు కాదు. 40 దొంగవోట్లు వేసుకొని గెలిచామని చెప్పుకుంటున్నారు. సురేష్ బాబు ప్రెసిడెంట్ గా మేము ఎప్పుడూ వారికి వ్యతిరేకమే. మంచి పనులు చేసి ఛాంబర్ ను బాగు పరిస్తే వారికి సహకరిస్తాం" అని చెప్పారు.
ప్రసన్న కుమార్ మాట్లాడుతూ "425 వోట్లు వేసి నన్ను గెలిపించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. చిన్న నిర్మాతల శ్రేయస్సు కోసం 5000 మినీ థియేటర్లు కట్టించాలని ప్లాన్ చేస్తున్నాం" అని చెప్పారు.