2010లో లలిత కళా పరిషత్ సంస్థను స్థాపించిన టి.సుబ్బిరామిరెడ్డి ప్రముఖ న్యూస్ ఛానల్ టీవీ9తో కలసి "టిఎస్ఆర్ టీవీ9" నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందిస్తున్నారు. ప్రజల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుని జూలై 19న ఈ అవార్డుల ప్రధానోత్సవం హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగింది. ఈ కార్యక్రమంలో ఏడు భాషలకు చెందిన సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా..
టి.సుబ్బరామిరెడ్డి మాట్లాడుతూ ‘అవార్డులు కళాకారులపై ప్రజలకున్న ప్రేమ, అభిమానాలను తెలియజేస్తాయి. కళాకారులకు కొండంత ఉత్సాహాన్ని, శక్తిని ఇస్తాయి. అందుకే తెలుగు ప్రజల తరపున ఈ అవార్డు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాను’’ అన్నారు.
మెగాస్టార్ చిరంజీవి మాట్లాడుతూ ‘‘భారతదేశంలోని విభిన్న బాషలకు చెందిన నటీనటులకు ఒక వేదికపై అవార్డులు ప్రధానం చేయడం అనేది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో దీక్ష అవసరం. అందుకు నిలువెత్తు నిదర్శనమే సుబ్బరామిరెడ్డిగారు. అవార్డులు ఎంతో ప్రోత్సాహాన్ని, శక్తిని ఇస్తాయి. ఇప్పుడు తెలుగు సినిమా ఖ్యాతి ప్రపంచస్థాయిలో నిలబెట్టిన సినిమా బాహుబలి. ఈ చిత్రాన్ని హాలీవుడ్ చిత్రాలకు ధీటుగా రూపొందించారు. ఇలాంటి చిత్రాలు రావడానికి ప్రోత్సాహం అనేది చాలా చాలా అవసరం. అలాంటి ప్రోత్సాహాన్నే సుబ్బిరామిరెడ్డి ఈ అవార్డుల రూపంలో అందిస్తున్నారు. ఒక జ్యూరీని ఏర్పాటు చేసి అవార్డులను అందజేస్తున్నారు. ఒకప్పుడు ఈ జ్యూరీలో అక్కినేని నాగేశ్వరరావుగారు వంటి ప్రముఖులు ఛైర్మన్‌గా ఉండేవారు. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న సుబ్బరామిరెడ్డిగారిని, టీవీ9లను అభినందిస్తున్నాను’’ అన్నారు.
నందమూరి బాలకృష్ణ మాట్లాడుతూ ‘‘లెజెండ్ సినిమాకి అవార్డు అందుకోవడం చాలా ఆనందంగా ఉంది. ఈ చిత్ర దర్శక నిర్మాతలకు నాతో పనిచేసిన నటీనటులకు, టెక్నిషియన్స్‌కి థాంక్స్’’ అన్నారు.
విక్టరీ వెంకటేష్ మాట్లాడుతూ ‘‘దృశ్యం వంటి డిఫరెంట్ మూవీని చేయడం ఆనందంగా ఉంది. నా కెరీర్ లో బెస్ట్ ఫిలిం గా నిలిచింది. ఈ సినిమాలో వర్క్‌చేసిన శ్రీప్రియ, మీనా సహా టీమ్ సభ్యులకు థాంక్స్’’ అన్నారు.
మంచు మోహన్ బాబు మాట్లాడుతూ ‘‘రౌడీ సినిమాకి నాకు అవార్డు రావడం ఆనందంగా ఉంది. ఈ అవార్డు రామ్‌గోపాల్‌వర్మకే చెందుతుంది. మంచి దర్శకుడాయన. సుబ్బిరామిరెడ్డి ఇలాంటి ఓ మంచి కార్యక్రమాన్ని చేపట్టడం చాలా ఆనందంగా ఉంది’’ అన్నారు.
అక్కినేని నాగచైతన్య మాట్లాడుతూ ‘‘మనం సినిమా మా ఫ్యామిలీకి స్పెషల్ మూవీ. ఈ సినిమా టైమ్‌లో తాతగారితో గడిపిన క్షణాలు మరచిపోలేనిది. ఈ సినిమాకి అవార్డు ఇచ్చిన సుబ్బరామిరెడ్డిగారికి థాంక్స్’’ అన్నారు.
టిఎస్‌ఆర్, టివి9 నేషనల్ ఫిలిం అవార్డ్స్ 2013:
బెస్ట్ యాక్టర్- మహేష్‌బాబు (సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు)
బెస్ట్ హీరో - రావమ్‌చరణ్ (నాయక్)
బెస్ట్ యాక్ట్రెస్- తమన్నా (తడాఖా)
బెస్ట్ హీరోయిన్ -సమంతా (అత్తారింటికి దారేది)
బెస్ట్ డైరెక్టర్-శ్రీను వైట్ల (బాద్‌షా)
బెస్ట్ ఫిలిం-సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు (దిల్ రాజు)
బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ ఫిలిం-బాద్‌షా (బండ్లగణేష్)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- దేవిశ్రీప్రసాద్ (అత్తారింటికి దారేది)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)- విజయప్రకాష్ (అత్తారింటికి దారేది)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్)- టీనాకమల్ (మనసున మనసై)
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (మేల్)- రావు రమేష్ (సీతమ్మవాకిట్లో..)
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫిమేల్)- నదియా (అత్తారింటికి దారేది)
బెస్ట్ కమెడియన్- బ్రహ్మానందం (అత్తారింటికి దారేది, బాద్‌షా)
టిఎస్‌ఆర్-టివి9 నేషనల్ ఫిలిం అవార్డ్స్- 2014:
బెస్ట్ యాక్టర్- బాలకృష్ణ (లెజెండ్)
బెస్ట్ హీరో- అల్లు అర్జున్ (రేసుగుర్రం)
బెస్ట్ యాక్ట్రెస్- శ్రియ (మనం)
బెస్ట్ హీరోయిన్- రకుల్‌ప్రీత్‌సింగ్ (లౌక్యం)
బెస్ట్ డైరెక్టర్- బోయపాటి శ్రీను (లెజెండ్)
బెస్ట్ విలన్- జగపతిబాబు (లెజెండ్)
బెస్ట్ ఫిలిం- దృశ్యం (డి.సురేష్‌బాబు, నిర్మాత)
బెస్ట్ మ్యూజిక్ డైరెక్టర్- ఎస్.ఎస్. తమన్ (రేసుగుర్రం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (మేల్)- సింహా (రేసుగుర్రం)
బెస్ట్ ప్లేబ్యాక్ సింగర్ (ఫిమేల్)- సునీత (ఊహలు గుసగుసలాడే)
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (మేల్)- ముఖేష్‌రుషి (రేసుగుర్రం)
బెస్ట్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ (ఫిమేల్)- జయసుధ (ఎవడు)
బెస్ట్ కమెడియన్- బ్రహ్మానందం (రేసుగుర్రం)
జ్యూరీ అవార్డ్స్:
ఉత్తమ నటుడు- వెంకటేష్ (దృశ్యం)
ఉత్తమ నటుడు- నాగార్జున (మనం)
ఉత్తమ నటి- మీనా (దృశ్యం)
ఉత్తమ దర్శకుడు- శ్రీప్రియ (దృశ్యం)
ఉత్తమ హీరో- గోపీచంద్ (లౌక్యం)
ఉత్తమ నటి- మంచు క్ష్మి (చందమామకథలు 2014)
ఉత్తమ క్యారెక్టర్ నటుడు- పోసాని కృష్ణమురళి
ఉత్తమ నటి- చార్మి (తెలుగు, కన్నడ)
ఉత్తమ నటి- స్నేహాఉల్లాల్ (తెలుగు, హిందీ)
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్:
లెజెండ్ యాక్టర్ ఆఫ్ సిల్వర్ స్క్రీన్ అవార్డ్- కృష్ణంరాజు
సిల్వర్ స్క్రీన్ ఔట్‌స్టాండిరగ్ పర్ఫామెన్స్ అవార్డ్- మోహన్‌బాబు (యమలీల2, రౌడీ)
లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్: జయసుధ
లైఫ్‌టైమ్ అఛీవ్‌మెంట్ అవార్డ్- పరుచూరి బ్రదర్స్
సెన్సేషనల్ యాక్టర్ అవార్డ్ - రాజశేఖర్
హిందీ:
స్టార్ ఆఫ్ మిలీనియం అవార్డ్- శతృఘ్నసిన్హా
మిలీనియం సెన్సేషనల్ స్టార్ అవార్డ్- రిషి కపూర్
లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డ్- షబనా అజ్మీ
మిలీనియం అవార్డ్ ఆఫ్ ప్రొడ్యూసర్ డైరెక్టర్- రమేష్‌సిప్పి
బాలీవుడ్ షైనింగ్ యాక్ట్రెస్ అవార్డ్- రవీనాటాండన్
బాలీవుడ్ షైనింగ్ స్టార్ అవార్డ్- శిల్పాశెట్టి
బాలీవుడ్ క్రియేటివ్ ఫిలింమేకర్ అవార్డ్- మధుర్ భండార్కర్
బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరోయిన్ అవార్డ్- పద్మిని కొల్హాపురి
మోస్ట్ ప్రామిసింగ్ రైజింగ్ స్టార్ (మేల్) - దిగాంత్ మంచాలే
మోస్ట్ ప్రామిసింగ్ రైజింగ్ స్టార్ (ఫిమేల్)- అనుష్క రంజన్
సెన్సేషనల్ యాక్ట్రెస్ అవార్డ్- మహి గిల్
సిల్వర్ స్క్రీన్ స్టార్ ఆఫ్ మ్యూజిక్ అవార్డ్ - అద్నాన్ సమి
మిలీనియం వెర్సటైల్ స్టార్ అవార్డ్- శక్తి కపూర్
బెస్ట్ యాక్టర్ ఇన్ నెగటివ్ రోల్ అవార్డ్- గుల్షన్ గ్రోవర్
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ ఫర్ తమిళ్, మయాళం, కన్నడ, బెంగాలీ పంజాబీ ఫిలింస్:
లైఫ్‌టైం అఛీవ్‌మెంట్ అవార్డ్- ప్రభు (తమిళ్)
జ్యూరీ అవార్డ్ - బెస్ట్ యాక్ట్రెస్- తాప్సీ (తమిళ్)
జ్యూరీ అవార్డ్ - బెస్ట్ యాక్ట్రెస్ - త్రిష (తమిళ్)
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్- జయప్రద (మయాళం, ప్రణయం)
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్- అమలాపాల్ (మయాళం, ఒరు ఇండియన్ ప్రణయకథ)
బెస్ట్ ప్రొడ్యూసర్ అవార్డ్- పివి గంగాధరన్ (మయాళం)
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్- జయప్రద (కన్నడ, క్రాంతివీర సంగోలి రాయన్న)
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్- సంజన (కన్నడ)
బెస్ట్ యాక్టర్ అవార్డ్ - సుదీప్ (కన్నడ)
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ - శతాబ్దిరాయ్ (బెంగాలీ)
బెస్ట్ యాక్ట్రెస్ అవార్డ్ - జోనిత (పంజాబీ)
ఇంకా ఈ కార్యక్రమంలో రామ్ చరణ్, శ్రీనువైట్ల, శ్రియ, శిల్పాశెట్టి, గోపిచంద్, శక్తి కపూర్, పద్మిని కుంపూర్, రిషి కపూర్, షబానా అజ్మీ, గుల్షన్ గ్రోవర్, రవీనాటాండన్, రమేష్ షిప్పి, రెజీనా, తాప్సీ, మంచు లక్ష్మి, బోయపాటి శ్రీను, తమన్నా, జీవిత, జమున, అదానాన్ సామి, శ్రియ, పరుచూరి బ్రదర్స్, సీనియర్ నటి జమున, జయసుధ, జయప్రద, శోభనా కామినేని, పింకీరెడ్డి, ప్రభు, రమేష్ ప్రసాద్, రకుల్ ప్రీత్ సింగ్, ముఖేష్ రుషి తదితరులు పాల్గొన్నారు.