Advertisementt

జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్న పవన్‌..!!

Wed 08th Jul 2015 07:57 AM
pawan kalya,twitter,press meet,counter  జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్న పవన్‌..!!
జైలుకు వెళ్లడానికి సిద్ధమంటున్న పవన్‌..!!
Advertisement
Ads by CJ

పవన్‌ తన వ్యాఖ్యలపై మళ్లీ స్పందించాడు. తాను చేసిన విమర్శలకు సీమాంధ్ర ఎంపీలు కౌంటర్‌ విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. కేంద్రమంత్రి సుజనాచౌదరిని విమర్శించే స్థాయి పవన్‌కు లేదంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. అదే ఎంపీలు ఎన్నికలకు ముందు పవన్‌తో తమ తమ నియోజకవర్గాల్లో ప్రచారం చేయించుకోవడానికి బారులు తీసిన విషయం తెలిసిందే. ఇక బుధవారం పవన్‌ ఏపీ ఎంపీల విమర్శలకు సమాధానం ఇచ్చారు.

స్పెషల్‌ స్టేటస్‌పై ప్రశ్నించిన తనను విమర్శిస్తే ప్రత్యేక హోదా రాదంటూ ఎంపీలకు చురకలంటించారు. అంతేకాకుండా తాను వ్యాపారాలు చేయడం తప్పనలేదని, కేవలం వ్యాపారం మాత్రమే చేస్తూ.. ప్రజలను పట్టించుకోకపోవడం తప్పని విమర్శించారు. ఇక అంతకుముందు తనపై పోలీసులకు ఫిర్యాదు చేస్తామన్న అంశానికి స్పందిస్తూ.. నేను జైలుకు వెళ్లడానికి , కోర్టులను ఎదుర్కొవడానికి సదా సిద్ధమని, అయితే నాయకులు మాత్రం అవసరాల్లో ఉన్న ప్రజలకు సేవ చేయండి అంటూ హితబోధ చేశారు. ఇక పవన్‌కల్యాణ్‌ మాటలు టీడీపీలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. పవన్‌పై ఎంపీల విమర్శలను ఆ పార్టీ నాయకులే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ