ముఖ్యమంత్రి కెసిఆర్ గారు చేపట్టిన హరితహారానికి మద్దతుగా తెలంగాణా జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన 'అడాప్ట్ ఏ ట్రీ ఛాలెంజ్' అనే వినూత్నమైన కార్యక్రమంలో భాగంగా తెలంగాణా జాగృతి రాష్ట్ర ఉపాధ్యక్షులు విసిరిన ఛాలెంజ్ ను స్వీకరించి నేడు ఫిలిం ఛాంబర్ లో ''మా'' అధ్యక్షులు రాజేంద్రప్రసాద్ మరియు వరంగల్ శాసనసభ్యులు దాస్యం వినయ్ భాస్కర్, కవిగాయకులు దేశపతి శ్రీనివాస్, టివి ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ విజయ్ యాదవ్ లు మొక్కలు నాటి వాటిని పెంచే బాధ్యతను కూడా తీసుకొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వృక్ష సంపద క్షీణించిపోతున్న ఈ కాలంలో ముఖ్యమంత్రి కెసిఆర్ గారు హరిత హారాన్ని చేపట్టడం, అందులు భాగంగా తెలంగాణా జాగృతి 'అడాప్ట్ ఏ ట్రీ ఛాలెంజ్' అనే వినూత్నమైన కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయం అని పొగిడారు. ఇందులో భాగంగా మొక్కలు నాటిన ప్రముఖులు మరో ఐదుగురిని నామినేట్ చేయడం జరిగింది.