Advertisement

సినీజోష్ ఇంటర్వ్యూ- తమన్నా(బాహుబలి)

Sun 05th Jul 2015 02:58 PM
bahubali,rajamouli,tamanna,sobhu yaarlagadda,prasad devineni  సినీజోష్ ఇంటర్వ్యూ- తమన్నా(బాహుబలి)
సినీజోష్ ఇంటర్వ్యూ- తమన్నా(బాహుబలి)
Advertisement

'హ్యాపీ డేస్' , '100% లవ్' వంటి హిట్ చిత్రాలలో నటించిన హీరోయిన్ తమన్నా తాజాగా రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న'బాహుబలి' చిత్రంలో లీడ్ రోల్ ప్లే చేసింది. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా హీరోయిన్ తమన్నాతో సినీజోష్ ఇంటర్వ్యూ..

ఇంత పెద్ద ప్రాజెక్ట్ లో పని చేయడం ఎలా అనిపించింది..?

ఇదొక చారిత్రక నేపధ్యంలో తెరకెక్కించిన సినిమా. అన్ని కమర్షియల్ చిత్రాలలో నటించడం వలన కేవలం ఆ చిత్రాలలో నటించడానికే పరిమితమవుతుంటాం. రొటీన్ గా కనిపించే పాత్రల్లోనే కనిపిస్తాం. కాని ఇలాంటి చిత్రాలో నటిస్తేనే మన ప్రతిభనేది తెలుస్తుంది. ఇదొక ఫ్రెష్ కాన్సెప్ట్. ఈ చిత్రంలో నేనొక ప్రిన్సెస్ వారియర్ పాత్రలో నటించాను. నా క్యారెక్టర్ లో చాలా షేడ్స్ ఉంటాయి. ఇప్పటివరకు రిలీజ్ చేసిన పోస్టర్ లో ఒక షేడ్ మాత్రమే రివీల్ చేసారు. ప్రేక్షకులకు సినిమా చూసాక చాలా సర్ప్రైసింగ్ గా అనిపిస్తుంది. ఈ  క్యారెక్టర్ నా కెరీర్ కు ఖచ్చితంగా ప్లస్ అవుతుంది.

రాజమౌళి గారితో మొదటిసారి వర్క్ చేసారు కదా ఎలా ఫీల్ అయ్యారు..?

అందరూ అన్నట్లుగా ఆయన నిజంగానే ఓ లెజెండరీ డైరెక్టర్. చాలా ప్లానింగ్ తో ఉంటారు. 'బాహుబలి' ప్రీ ప్రొడక్షన్ పనులకు సుమారుగా సంవత్సరంన్నర సమయం తీసుకున్నారు. షూటింగ్ కు ముందు మాక్ షూట్స్ కండక్ట్ చేసేవారు. రెండు రోజుల తరువాత చేయాల్సిన షూటింగ్ ముందుగా మాతో రిహార్సల్స్ చేయించేవారు. సెట్ లో ఉన్న అందరిని కూల్ టెంపర్ తో హ్యాండిల్ చేసేవారు. ఆయన స్క్రిప్ట్ నేరేట్ చేసేప్పుడు చాలా క్లారిటీ తో చెప్తారు. మరోసారి అడగాల్సిన అవసరం కూడా రాదు. 'పచ్చబొట్టు' సాంగ్ షూటింగ్ జరుగుతున్నప్పుడు ఓ బెస్ట్ కాంప్లిమెంట్ ఇచ్చారు. నా లైఫ్ లో ఆ కాంప్లిమెంట్ మర్చిపోలేను.

బాహుబలి మీ లైఫ్ లో బెస్ట్ ఫిలింగా నిలుస్తుందంటారా..?

ఖచ్చితంగా  ఈ సినిమా నేను చేసిన అన్ని చిత్రాల కంటే నాకు మంచి పేరు తెస్తుంది. కాని ఈరోజు నేను  యాక్టర్ గా నిలదొక్కుకోవడానికి 'పయ్యా' , '100% లవ్' చిత్రాలే కారణం. నన్ను ఓ నటిగా ప్రేక్షకులకు దగ్గర చేసిన చిత్రాలు కూడా అవే.

బాహుబలి రెండో భాగంలో మీ పాత్ర కంటిన్యూ అవుతుందా..?

సినిమాలో ముఖ్యమైన ఏడు పాత్రలు రెండవ భాగంలో ఉంటాయి. నా పాత్ర కూడా రెండో పార్ట్ లో కంటిన్యూ అవుతుంది. మొదటి భాగంతో పోల్చితే రెండో పార్ట్ లో నా పాత్ర నిడివి తక్కువ ఉంటుంది. 

షూటింగ్ సమయంలో మెమొరబుల్ ఎక్స్ పీరియన్సెస్ ఏమైనా ఉన్నాయా..?

బల్గేరియా ప్రాంతంలో -10 డిగ్రీల ఉష్ణోగ్రతలో యాక్షన్ ఎపిసోడ్స్ షూటింగ్ జరిపారు. అక్కడ నిలబడడానికే చాలా కష్టంగా ఉంటే మా టెక్నీషియన్స్, రాజమౌళి సర్ కొడుకు కార్తికేయ వారి పనుల్లో నిమగ్నం అయ్యేవారు. ఎంతో ప్యాషన్ తో చేస్తేనే తప్ప ఈ సినిమా సాధ్యం కాదు. అందరి వర్క్ చూసి నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. 

నిర్మాతల గురించి చెప్పండి..?

శోభు యార్లగడ్డ, ప్రసాద్ దేవినేని గార్లతో కోఆర్డినేషన్ చాలా బావుండేది. ఆర్టిస్టులతో డైరెక్ట్ గా మాట్లాడతారు. కమ్యూనికేషన్ చాలా సులువుగా ఉండేది. ఇంత మంచి చిత్రాన్ని కేవలం తెలుగుకే అంకితం చేయకూడదని ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం ఆదరణ పొందాలని వివిధ భాషల్లో ఈ చిత్రాన్ని డబ్ చేసారు. సినిమాపై వారికి చాలా నమ్మకం ఉంది. మొదటిసారి ఓ చారిత్రక నేపధ్యం కలిగిన చిత్రంలో విజువల్ ఎఫెక్ట్స్ భారీగా పెట్టారు. 

ఈ సినిమాను చూసారా..?

మొత్తం చూడలేదు. నా సన్నివేశాల వరకు చూసాను. నేను కూడా అందరిలా సినిమా చూడడానికి చాలా ఎగ్జైటెడ్ గా ఉన్నాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

తమిళంలో అవుట్ అండ్ అవుట్ నెగెటివ్ రోల్ లో కనిపించే ఓ చిత్రంలో నటిస్తున్నాను. నాకు నెగెటివ్ పాత్రాల్లో నటించడమంటే చాలా ఇష్టం. పెర్ఫార్మన్స్ కు స్కోప్ ఎక్కువ ఉంటుంది. అది కాకుండా నాగార్జున, కార్తి కాంబినేషన్ లో వస్తున్న ద్విభాషా చిత్రంలో నటిస్తున్నాను. హీరో రవితేజ తో బెంగాల్ టైగర్ చిత్రంలో నటిస్తున్నాను.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement