టీడీపీ అధికారంలోకి వస్తే.. మళ్లీ జగన్ జైలుకు వెళ్లడం ఖాయమని ఏపీవాసులు భావించారు. అయితే కాంగ్రెస్ హయాంలో కంటే కూడా టీడీపీ హయాంలో జగన్ కేసు విచారణ నెమ్మదించడం గమనించదగినది. అయితే తనకు దేవుడిచ్చిన సోదరుడు(జగన్)కు మద్దతుగా గాలి జనార్దన్‌రెడ్డి కేంద్రం స్థాయిలో చక్రం తిప్పి ఈ కేసు విచారణ నెమ్మదించేలా చేశారన్న ఊహాగానాలు కూడా వినిపించాయి. ఇప్పుడు ఇవన్నీ పక్కనపెడితే జగన్ కేసును సీబీఐ ఎంతవరకు తీసుకువచ్చింది. మరెంతకాలం నాన్చుతుందో ఇప్పుడు తప్పక తేల్చాల్సిన సమయం వచ్చింది.
జగన్‌పై నమోదైన కేసులకు సంబంధించి సీబీఐ విచారణలోని పురోగతిని తెల్పాలంటూ విజయవాడకు చెందిన న్యాయవాది వేదవ్యాస్ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు. దీన్ని విచారించిన హైకోర్టు పిటీషన్‌దారుడికి అనుకూలంగా తీర్పునిచ్చింది. ఈ కేసు విచారణ పురోగతిని కోర్టుకు తెల్పాలంటూ సీబీఐని ఆదేశించింది. దీంతో ఈ కేసుపై సీబీఐ తప్పక ఓ స్పష్టత ఇవ్వాల్సిన పరిస్థితి. అంతేకాకుండా సరాసరి ఎంతకాలంలో ఈ కేసు విచారణను పూర్తి చేయనుందో కూడా కోర్టుకి తేల్పాల్సి రావొచ్చు. దీన్నిబట్టి మరెంత కాలం తర్వాత జగన్ మళ్లీ కటకటాల వెనక్కి వెళ్లనున్నాడో..? లేక నిర్దోషిగా కడిగిన ముత్యంవలె ప్రజల ముందుకు రానున్నాడో తేలే అవకాశం ఉంది.