'రన్ రాజా రన్' చిత్రంలో నటించి మొదటి సినిమాతోనే మంచి నటిగా పేరు తెచ్చుకున్న నటి శీరత్ కపూర్. ప్రస్తుతం ఆమె నటించిన 'టైగర్' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈసందర్భంగా హీరోయిన్ శీరత్ కపూర్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమాలో మీ పాత్ర గురించి చెప్పండి..?
ఈ చిత్రంలో గంగ అనే పాత్రలో నటించాను. వారణాసి ఆర్థొడాక్స్ ఫ్యామిలీకు చెందిన అమ్మాయి. సినిమా అంతా వారణాసి బ్యాక్ డ్రాప్ లో నడుస్తుంటుంది.
స్క్రిప్ట్స్ ఎలా సెలెక్ట్ చేసుకుంటారు..?
కథ ఎంపిక విషయంలో చాలా సెలెక్టివ్ గా ఉంటాను. ఎన్ని ఆఫర్స్ వచ్చినా స్టొరీ నచ్చితేనే సినిమా చేస్తాను. రన్ రాజా రన్ సినిమాలో నాదొక మోడరన్ అమ్మాయి క్యారెక్టర్ ఈ సినిమాలో చూస్తే ట్రెడిషనల్ పాత్రలో కనిపిస్తాను. ఇలా సినిమా సినిమాకు మధ్య డిఫరెన్స్ ఉండేలా జాగ్రత్త తీసుకుంటాను.
సినిమాలో హైలైట్స్ ఏంటి..?
సినిమా ప్రారంభమయినప్పటి నుండి చివరి వరకు ఎమోషనల్ రేంజ్ లో సాగుతుంది. స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తుంది. ఒక సీన్ జరిగిన తరువాత నెక్స్ట్ ఏం జరుగుతుందో అనే క్యూరియాసిటీ ప్రేక్షకులలో కలుగుతుంది. సినిమాకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్ ప్లస్ అవుతాయి.
షూటింగ్ టైం లో ఏమైనా మరిచిపోలేని అనుభవాలు ఉన్నాయా..?
వారణాసి లో మేము షూటింగ్ చేస్తున్న సంగతి అక్కడ ఉండే వారికి తెలియదు. ఆ నదిలో బోట్ నడుపుతూ చేసే యాక్షన్ సన్నివేశం ఉంటుంది. వెనుక నుండి పెద్ద పెద్దగా అరుస్తూ పాటలు పాడతారు. ఆ సీన్ ఎప్పటికి మరిచిపోలేను.
మీ కో యాక్టర్స్ సందీప్ కిషన్, రాహుల్ ల గురించి చెప్పండి..?
నా మొదటి సీన్ రాహుల్ తోనే చేసాను. మంచి ఆటిట్యూడ్ ఉన్న మనిషి. ఇక సందీప్ కిషన్ విషయానికి వస్తే తనొక స్పాంటేనియస్ యాక్టర్. నెక్స్ట్ సీన్ లో ఎలా నటించాలని అందరు ప్రిపేర్ అవుతుంటే తను మాత్రం చక చకా చేసుకుంటూ వెళ్ళిపోతాడు. తన పక్కన ఉండే వారిని ఇంకా బాగా చేయగలవని ప్రోత్సహిస్తాడు.
తెలుగు ఇండస్ట్రీ ఎలా ఉంది..?
ఇక్కడున్నవారంత చాలా సపోర్టివ్ గా ఉన్నారు. గ్లామర్ కన్నా నటన కే ఎక్కువ ఇంపార్టన్స్ ఇస్తారు. తెలుగు ఇండస్ట్రీలో ఉన్నందుకు చాలా గర్వంగా, సంతోషంగా ఉంది.
నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?
ప్రస్తుతం సుమంత్ అశ్విన్ హీరోగా ఓ చిత్రంలో నటిస్తున్నాను. అది 75% షూటింగ్ కంప్లీట్ అయింది. త్వరలోనే రిలీజ్ కానుంది.