Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ-సందీప్ కిషన్..!

Fri 26th Jun 2015 02:59 AM
sandeep kishan,tiger movie,anand,varanasi back drop  సినీజోష్ ఇంటర్వ్యూ-సందీప్ కిషన్..!
సినీజోష్ ఇంటర్వ్యూ-సందీప్ కిషన్..!
Advertisement

'ప్రస్థానం' , 'గుండెల్లోగోదారి' , 'వెంకటాద్రి ఎక్స్ ప్రెస్' , 'బీరువా' వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సంపాదించుకున్న హీరో సందేప్ కిషన్. ప్రస్తుతం ఆయన నటించిన 'టైగర్' జూన్ 26న విడుదలకు సిద్ధంగా ఉంది. వి.ఐ.ఆనంద్ దర్శకుడు. ఎన్.వి.ప్రసాద్ నిర్మాత. ఈ సందర్భంగా హీరో సందీప్ కిషన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

'టైగర్' సినిమా ఎలా ఉండబోతోంది..?

ఈ చిత్రాన్ని వారణాసి లో జరిగిన యాదార్ధ సంఘటనల ఆధారంగా తెరకెక్కించాం. ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఓ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. సినిమాలో నా పాత్ర పేరు టైగర్. రాజమండ్రిలో ఓ అనాధశరణాలయంలో పెరిగిన అబ్బాయి చిరంజీవి గారి లంకేశ్వరుడు సినిమా చూసి తనకు తనే టైగర్ అని పేరు పెట్టుకుంటాడు. ఇదొక ఎంటర్ టైనింగ్ యాక్షన్, థ్రిల్లర్ మూవీ. కథ చాలా ఫ్రెష్ గా ఉంటుంది. సినిమాలో ప్రతి పాత్ర, ఎమోషన్స్ రియల్ గా ఉంటాయి.

సినిమాలో నటించడానికి కారణం..?

ఈ చిత్రాన్ని తమిళంలో మురుగదాస్ గారు చేయాలనుకున్నారు. కాని ఆయన ఏవో కారణాల వలన చేయలేకపోయారు. డైరెక్ట్ ఆనంద్ గారికి నా పేరు సజెస్ట్ చేసారు. ఆయన నాకు స్టొరీ చెప్పగానే చాలా కొత్తగా అనిపించింది. వెంటనే ఓకే చెప్పాను. రెగ్యులర్ కమర్షియల్ సినిమా అని అనిపించకుండా ఉండే ప్రయత్నం చేసాం.  

'టైగర్' అనే పవర్ ఫుల్ టైటిల్ పెట్టే ఆలోచన ఎలా వచ్చింది..?

ఈ చిత్రాన్ని తమిళంలో చేయాలనుకున్నప్పుడు 'అక్బర్' అనే టైటిల్ అనుకున్నారు. కాని ఆ టైటిల్ తెలుగు వెర్షన్ కు అంత సూట్ కాదు. ఎలాంటి టైటిల్ పెట్టాలి అని ఆలోచిస్తున్న సమయంలో పేపర్ లో ఓ హెడ్డింగ్ లో టైగర్ అని ఉంది. వెంటనే ఈ టైటిల్ మన సినిమాకు చాలా క్యాచీగా ఉంటుందని డైరెక్టర్ గారు చెప్పగానే అందరు ఓకే చేసారు. ఈ సినిమాలో టైగర్ చాలా సరదాగా ఉంటుంది. కోపం వస్తేనే కాని రియాక్ట్ అవ్వదు.

మీ పాత్రలో నటిస్తున్నప్పుడు ఎలా అనిపించింది..?

ప్రతి సినిమా నేను చాలా పర్సనల్ గ తీసుకుంటాను. కమర్షియల్ సక్సెస్ అనేది నా చేతిలో ఉండదు. సినిమా ప్రేక్షకులకు కొత్తగా ఉంటుందా.. లేదా.. అనే ఆలోచిస్తాను. ఈ చిత్రంలో నా పాత్ర ఇప్పటివరకు నేను చేసిన సినిమాల్లోకెల్లా హై ఎనర్జీ ఉండే క్యారెక్టర్. చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది.

డైరెక్టర్ ఆనంద్ గురించి..?

చాలా కూల్ గా ఉండే మనిషి. కామన్ కంపోస్డ్ పర్సన్. ఇది పెద్ద బడ్జెట్ మూవీ కాని మాకున్న లిమిట్ లోనే చిత్రాన్ని తెరకెక్కించాలి. యూనిట్ లో అందరు కొన్ని విషయాలకు టెన్షన్ పడినా ఆయన మాత్రం చాలా కూల్ గా తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోయేవాడు. తన ఆలోచనా విధానం నాకు నచ్చుతుంది. రియల్ స్టొరీ అయినా కమర్షియల్ ఎలిమెంట్స్ జోడించి తీసారు. సినిమా కంప్లీట్ అయ్యాక తెరపై చూస్తే మంచి సినిమా చేశామనే త్రుప్తి కలిగింది. 

సినిమాలో హైలైట్స్ ఏంటి..?

ఈ చిత్రానికి కథే హీరో. క్లైమాక్స్ హైలైట్ గా నిలుస్తుంది. ఇది యాక్షన్ సినిమా అయినా రెండు ఫైట్స్ మాత్రమే ఉంటాయి. సినిమాలో పాటలు, ఫైట్స్ సిట్యుయేషన్స్ తగ్గట్లుగా ఉంటాయి. సినిమాలో ప్రతి డైలాగ్ కథకు ప్లస్ అవుతుంది. తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్, సాంగ్స్, స్క్రీన్ ప్లే హైలైట్ గా నిలుస్తాయి.

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

స్టూడియో గ్రీన్ సంస్థతో తమిళంలో లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్నాను. నాకు జోడీగా రెజీనా నటిస్తోంది. ఆ చిత్రాన్ని తెలుగులో డబ్ చేస్తున్నారు.

 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement