ఓటుకు కోట్లు కేసులో ఏ-4 నిందితుడు జేరుసలెం మత్తయ్య ఇంకా ఏపీలోనే తలదాచుకున్నారు. మత్తయ్య అరెస్టుపై హైకోర్టు స్టే ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ కేసును విచారిస్తున్న బెంచీని మార్చాలని ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్ హైకోర్టులో పిటీషన్ వేశాడు. మత్తయ్య అరెస్టుపై స్టేను కూడా ఎత్తివేయాలని ఆయన కోరాడు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ మత్తయ్యకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాడన్న అనుమానం ఉందని, ఆయన్ను కూడా మార్చాలని కోరాడు.
ఇక మరోవైపు రేవంత్‌రెడ్డి బెయిల్ పిటీషన్ బుధవారం హైకోర్టు ముందుకు రానుంది. రేవంత్‌తోపాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న సెబాస్టియన్, ఉదయ్‌సిన్హాల బెయిల్ పిటీషన్‌ను హైకోర్టు ఈనెల 24కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. దీంతో రేపు ఎలాంటి కీలకపరిణామాలు చోటుచేసుకుంటాయోనని ఇరు రాష్ట్రాల ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరి ఇప్పటికైననా రేవంత్‌కు బెయిల్ ఇవ్వడానికి తెలంగాణ ఏసీబీ అంగీకరిస్తుందా..? లేక మరిన్ని రోజులు ఆయన్ను విచారించే అవకాశం కావాలని కోర్టును కోరుతుందా అనేది రేపు