ఓటుకు కోట్ల కేసు బయటపడినప్పటినుంచి సాక్షి మీడియాకు మరో వార్త కనిపించలేదు. సాక్షి టీవీ పొద్దస్తమానం దీనిపై చెప్పిందే చెప్పి స్క్రోలింగ్‌ల వర్షం కురిపించగా.. సాక్షి దినపత్రికకు ఈ కేసు గురించి రాయడానికి మొదటి పేజీ సరిపోయేది కాదు. కాని ఈ విషయానికి ఇప్పుడు ఇంతగా ప్రాధాన్యత ఇచ్చి జగన్ తప్పు చేశారేమోనన్న వాదనలు వినిపిస్తున్నాయి.
రాజకీయాల్లో ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లడం సర్వసాధారణమే. వారు వేరే పార్టీలోకి వెళ్లినప్పుడు నగదు రూపంలోనో.. పదవి రూపంలోనో లబ్ధి చేకూరుతుంది. ఇక జగన్ పార్టీలో ప్రస్తుతం ఉన్న నాయకగణమంతా ఒకప్పుడు ఇతర పార్టీల్లో ఉన్నవారే. గెలుపు ఆశ, పదవి ఆశతోనే వీరిలో చాలామంది వైసీపీలోకి వచ్చారనేది బహిరంగ రహస్యమే. ఇక చంద్రబాబు చేసింది కూడా ఘోర తప్పిదంగా ప్రజలు చూపడం లేదు. సాధారణ రాజకీయాల్లో భాగంగానే ఆయన టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను తన పార్టీలోకి తెచ్చుకోవాలని చూశారని వారు అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ మాత్రం ఓటుకు నోట్లు కేసుకు ఎంతో ప్రాధాన్యతనిచ్చారు. చంద్రబాబును ప్రజల ముందు దోషిగా నిలబెట్టడానికి గవర్నర్‌ను, కేంద్ర మంత్రులను కూడా కలుసుకొని ఫిర్యాదు చేశారు. ఈ వార్తకు అంతగా ప్రాధాన్యతనిచ్చిన జగన్ వర్గం, మీడియా సెక్షన్-8 గురించి మాట్లాడటానికి మాత్రం ఆసక్తి చూపలేదు. ఇది వారికి సంబంధం లేని విషయంలో వ్యవహరించారు. అదే ఏపీవాసుల ఆగ్రహానికి కారణమైంది. సెక్షన్-8 గురించి జగన్ డిమాండ్ చేస్తే కేసీఆర్‌తో దోస్తాని దెబ్బతింటుందనే ఆయన మిన్నకుండిపోయారని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. గతంలో తిరుపతిలో ఎన్‌కౌంటర్ కేసుకు సంబంధించి కూడా జగన్ వర్గం తమిళనాడుకు మద్దతుగా వాదించింది. తమిళనాడు కార్మికులు శేషాచలం అడవుల్లో ఎర్రచందనం దొంగిలిస్తున్నారని తెలిసీ కూడా ఆ విషయమై మాట్లాడకుండా కేవలం బాబును దోషిగా ఎత్తిచూపే ప్రయత్నంలో తమిళనాడు వర్గీయులను మించి ఆంధ్రాకు వ్యతిరేకంగా మాట్లాడారు. ఇలా చంద్రబాబును దోషిగా నిలబెట్టే యత్నంలో తన సొంత పార్టీకి జగన్ ఎసరు తెచ్చుకుంటునారన్న వాదనలు ఉన్నాయి. ఇక హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలైతే ఓటుకు కోట్లు కేసును మరిచిపోయి కూడా ఏపీవాసులు బాబును హీరోగా చూస్తారనడానికి ఎలాంటి సందేహం