హైదరాబాద్‌లో సెక్షన్-8 అమలు చేయాల్సిందేనని చంద్రబాబు పట్టుబడుతున్నారు. విభజన చట్టంలో పేర్కొన్న హామీల్లో ఏ ఒక్కటీ సరిగ్గా అమలు చేయలేదని, కనీసం సెక్షన్-8నైనా అమలు చేసి ఆంధ్రప్రదేశ్‌కు న్యాయం చేయాలని ఆయన కేంద్రాన్ని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ సెక్షన్‌ను అమలు చేయడానికి ఎలాంటి నిధుల అవసరం కూడా లేకపోవడంతో కేంద్రం ఈ విషయమై సానుకూలంగా స్పందించే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తున్నాయి. అయితే హైదరాబాద్‌లో సెక్షన్-8ను అమలు చేస్తే టీడీపీ భవితవ్యం ఏంటన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.
ఇన్నాళ్లుగా తెలంగాణతో ఎన్నో పేచీలు వచ్చినా చంద్రబాబు ఓ అడుగు కిందకు దిగి సంయమనం పాటించారు. తెలంగాణలో పార్టీని కాపాడుకోవాలన్న లక్ష్యంతో ఆయన కొంత రాజీ ధోరణిని అవలంబించిన సంగతి ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. కాని ఓటుకు కోట్లు కేసులో ఆయన పూర్తిగా ఇరుక్కుపోవడంతో ఆంధ్రప్రదేశ్‌లో కూడా టీడీపీకి దెబ్బపడే అవకాశాలు కనిపించాయి. దీంతో ఇక లాభం లేదనుకున్న చంద్రబాబు తెలంగాణలో పార్టీ భవితవ్యాన్ని పక్కకుపెట్టి ఏపీలో టీడీపీని కాపాడుకోవడంపై దృష్టిపెట్టారు. అందులో భాగంగానే ఆయన సెక్షన్-8 అమలు చేయాలంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇక ప్రస్తుతానికి తెలంగాణ టీడీపీ నాయకులు ఈ విషయంపై స్పందించకుండా మౌనం పాటిస్తున్నారు. 2014లో గెలిచిన ఎమ్మెల్యేల్లో ఇప్పటికే 5 మంది టీఆర్‌ఎస్‌లోకి జంప్ చేశారు. ఇక సెక్షన్-8 అమలైతే మిగిలిన వారు కూడా ప్రత్యామ్నాయం చూసుకోకతప్పదనే వాదనలు