Advertisementt

కేసీఆర్‌కు కలిసిరానున్న సెక్షన్‌-8..!!

Tue 23rd Jun 2015 10:55 PM
kcr,section 8,hyderabad,governer  కేసీఆర్‌కు కలిసిరానున్న సెక్షన్‌-8..!!
కేసీఆర్‌కు కలిసిరానున్న సెక్షన్‌-8..!!
Advertisement

హైదరాబాద్‌లో ఇప్పుడు సెక్షన్‌-8 అమలుపై రచ్చ కొనసాగుతోంది. సెక్షన్‌-8 అమలు చేయడానికి గవర్నర్‌ వడివడిగా అడుగులు వేస్తున్నాడని ఏపీ ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అమలు చేస్తే ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించమని తెలంగాణలోని రాజకీయ పార్టీలు, సంఘాలు తేల్చిచెబుతున్నాయి.

ఓటుకు కోట్లు కేసులో చంద్రబాబును పూర్తిగా ఇరికించామని మొదట టీఆర్‌ఎస్‌ పార్టీ సంబురాలు చేసుకుంది. అయితే ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారం ముందుకు తెచ్చి చంద్రబాబు సెక్షన్‌-8 అమలు చేయాలంటూ పట్టుబట్టి టీ-సర్కారుకు షాకిచ్చాడు. ఇప్పుడు ఈ దిశగా చర్యలు తీసుకోవడానికి గవర్నర్‌ అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుండటం తెలంగాణవాదుల్లో ఆందుళన రేపుతోంది. అయితే హైదరాబాద్‌లో సెక్షన్‌-8 అమలు చేస్తే అది టీఆర్‌ఎస్‌కు కూడా కలిసొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. తెలంగాణ సెంటిమెంట్‌తో అధికారంలోకి వచ్చిన టీఆర్‌ఎస్‌కు ఆ తర్వాత ప్రజలను ఆకట్టుకోవడానికి ఏ రూటు దొరకలేదు. ఉద్యమ పార్టీ నేతలుగా ఉద్యమాలు చేయడంలో ఎంతో ఎక్స్‌పీరియన్స్‌ ఉన్న టీఆర్‌ఎస్‌ గణం మరోసారి సెక్షన్‌-8పై పోరాటం పేరుతో సెంటిమెంట్‌ను రగిల్చే అవకాశం ఉంది. ఈ సెంటిమెంట్‌ ప్రజల్లోకి వెళితే అటు జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో, వరంగల్‌ ఎన్నికల్లోనూ టీఆర్‌ఎస్‌కు ఎంతోకొంత లబ్ధి చేకూరవచ్చు. అంతేకాకుండా ఉద్యోగాల నోటిఫికేషన్‌, కాంట్రాక్ట్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, డబుల్‌ బెడ్‌రూం ఇళ్ల నిర్మాణం.. ఇలా పలు అంశాల్లో టీఆర్‌ఎస్‌కు కొంత సమయం లభించే అవకాశం ఉంటుంది. ఇక సెక్ష్షన్‌-8 అమలుతో తెలంగాణలో టీడీపీ పూర్తిగా బలహీనపడితే.. అది టీఆర్‌ఎస్‌కు కలిసొచ్చే అంశమే. సెక్షన్‌-8తో హైదరాబాద్‌లో శాంతిభద్రతల పర్యవేక్షణ చేజారినా.. ఇలా టీఆర్‌ఎస్‌కు కొంత మేలు జరుగుతుందన్న సంగతి ప్రత్యేకంగా 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement