Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- రాహుల్ రవీంద్రన్

Tue 23rd Jun 2015 12:11 PM
rahul ravindran,tiger movie,sandeep kishan,anand  సినీజోష్ ఇంటర్వ్యూ- రాహుల్ రవీంద్రన్
సినీజోష్ ఇంటర్వ్యూ- రాహుల్ రవీంద్రన్
Advertisement
Ads by CJ

'అందాల రాక్షసి' చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యి మొదటి సినిమాతోనే మంచి పేరు సంపాదించుకున్న హీరో రాహుల్ రవీంద్రన్. ప్రస్తుతం ఆయన నటించిన 'టైగర్' చిత్రం విడుదలకు రెడీ అవుతోంది. ఈసందర్భంగా హీరో రాహుల్ రవీంద్రన్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..

'టైగర్' సినిమా ఎలా ఉండబోతోంది..?

ఇద్దరు ప్రాణ స్నేహితులు, ఓ అమ్మాయికి మధ్య జరిగే కథే ఈ చిత్రం. ఈ సినిమాలో నేను విష్ణు అనే పాత్రలో నటించాను. ఎనర్జిటిక్, బ్యాలన్స్డ్ గా ఉండే పాత్ర అది. అలాంటి అబ్బాయి ఓ అమ్మాయిని ప్రేమిస్తాడు. తన స్నేహితుడి కోసం, తను ప్రేమించిన అమ్మాయి కోసం ఏమైనా చేస్తాడు. ఈ సినిమాలో ఫ్రెండ్ షిప్ కు చాలా ఇంపార్టన్స్ ఉంటుంది. సినిమా చాలా యూనిక్ గా ఉంటుంది.

మరో హీరోతో కలిసి నటించే స్క్రిప్ట్స్ ను ఎందుకు సెలెక్ట్ చేసుకుంటున్నారు..?

ఇప్పుడిప్పుడే నా కెరీర్ లో గ్రోత్ కనిపిస్తుంది. 'అలాఎలా' సినిమా హిట్ తో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది. దానికి మంచి శాటిలైట్ వాల్యూస్ వచ్చాయి. ఆ చిత్రం తరువాత చాలా ఆఫర్స్ వచ్చాయి. కాని జాగ్రత్తగా స్క్రిప్ట్స్ ను సెలెక్ట్ చేసుకుంటున్నాను. ఈ సినిమాలో నా పాత్రకు హీరో పొజిషన్ లో ఉన్న నటుడు చేస్తేనే బావుంటుంది. సపోర్టింగ్ క్యారెక్టర్ అయినా, లీడ్ రోల్ అయినా మంచి కథ అయితే చేస్తాను. అలా అని వెంటవెంటనే సపోర్టింగ్ క్యారెక్టర్స్ చేయను.

ఈ సినిమాలో అవకాశం ఎలా వచ్చింది..?

మూడు సంవత్సరాలుగా సందీప్ తో నాకు పరిచయం ఉంది. మంచి స్నేహితుడు. ఆనంద్ దగ్గర మంచి కథ ఉంది. ఒకసారి విను నచ్చితే కలిసి చేద్దామని చెప్పారు. కథ వినగానే నాకు నచ్చింది. ఓకే చెప్పాను. ఓ ఫ్రెండ్ తో సినిమా చేయడం ఆనందంగా ఉంది. సెట్స్ పై చాలా ఎంజాయ్ చేసాం. 

డైరెక్టర్ ఆనంద్ గురించి..?

ఆనంద్ 'అప్పుచి గ్రామం' అనే తమిళ సినిమాను డైరెక్ట్ చేసారు. ఆయన వర్క్ చాలా నచ్చింది. ట్రీట్మెంట్ పరంగా 'టైగర్' ఫాస్ట్ బేస్డ్ మూవీ. ఎంటర్ టైన్మెంట్ వాల్యూస్ తగ్గకుండా చేసారు. కమర్షియల్ గా ఉండే ప్రయత్నం చేసారు. 

షూటింగ్ టైమ్ లో మరిచిపోలేని అనుభవాలు ఏమైనా ఉన్నాయా..?

చోటా కె నాయుడు లాంటి సీనియర్ సినిమాటోగ్రాఫర్ తో వర్క్ చేయడం చాలా హ్యాపీ అనిపించింది. ఆయనలో ఉన్న ఎనర్జీ మాలో లేదు. ఎందరో సీనియర్ హీరోల సినిమాలకు పనిచేసారాయన. అలాంటిది ఆయనొచ్చి బాగా చేసావని అని చెప్పగానే చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. 

తమిళంలో ఏమైనా సినిమాలు చేస్తున్నారా..?

ప్రస్తుతం ఒక ఇండస్ట్రీ లోనే కాన్సన్ ట్రేట్ చేయాలనుకుంటున్నాను. తమిళంలో 'సెగ' సినిమా డైరెక్టర్ తో ఓ సినిమా చేసే అవకాశం వచ్చింది. అయితే ఆ సినిమాను తెలుగులో కూడా రిలీజ్ చేస్తారంటేనే నటిస్తానని చెప్పాను. డైరెక్టర్ ఓకే చెప్పిన తరువాతే సినిమాలో నటించడానికి అంగీకరించాను. నా ప్రయారిటీ ముందు తెలుగుకే.

శ్రీమంతుడు సినిమాలో ఎలాంటి రోల్ లో నటిస్తున్నారు..?

ఓ అతిథి పాత్రలో నటిస్తున్నాను. మహేష్ గారు ఈ పాత్రకు నేనైతేనే సూట్ అవుతానని డైరెక్టర్ కొరటాల శివ కు చెప్పారంట. మహేష్ గారంటే నాకు చాలా ఇష్టం. అలాంటిది ఆయన రిఫర్ చేసారంటే చాలా సంతోషంగా అనిపించింది. సినిమాలో నా పాత్రకు ఇంపార్టన్స్ ఉంటుంది.

పది సినిమాల జర్నీ ఎలా ఉంది..?

లవ్లీ జర్నీ. వెనక్కి తిరిగి చూసుకుంటే 10 సినిమాలలో నటించానని చాలా సంతోషంగా అనిపిస్తుంది. నాకు సినిమాలంటే ఇష్టం. ఈ ప్రొఫెషన్ తప్ప మరొకటి తెలియదు. గ్రోత్ లేకపోయినా నేను సినిమాలు చేస్తూనే ఉంటాను. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

'హైదరాబాద్ లవ్ స్టొరీ' సినిమా సెన్సార్ కంప్లీట్ అయింది. జూలై లో లేదా ఆగస్ట్ లో సినిమాను రిలీజ్ చేసే ప్లాన్ లో ఉన్నాం. 'సెగ' సినిమా డైరెక్టర్ తో ఒక సినిమా. అవి కాకుండా సోలో హీరోగా రెండు ప్రాజెక్ట్స్ ఫైనల్ చేసాను. ఆ రెండు స్క్రిప్ట్ జూలై లేదా ఆగస్ట్ లో స్టార్ట్ అవుతాయి.

 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ