ఎన్నికలకు ముందు సుడిగాలి పర్యటనతో టీడీపీని పవర్‌లోకి తెచ్చిన పవన్‌కల్యాణ్ ఇప్పుడు మీడియా ఎదుటకు రాకపోవడంపై అన్ని దిక్కులనుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రశ్నించే నాయకుడు ఎందుక మౌనంగా ఉన్నాడంటూ ప్రశ్నిస్తున్న వారి సంఖ్యపెరిగిపోతోంది. ఇప్పటికే పవన్‌కల్యాణ్‌ను ఇన్‌డైరెక్ట్‌గా ద్రోహీ అంటూ వర్మ విమర్శించిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వి.హనుమంతరావు కూడా ఓటుకు నోటు కేసులో పవన్‌కల్యాణ్ మాట్లాడలంటూడిమాండ్ చేశారు.
అవినీతిని ప్రశ్నిస్తాన్న పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనంగా ఉన్నారంటూ వీహెచ్ ప్రశ్నించారు. ఓటుకు నోటు కేసుపై పవన్ స్పందించాలని వీహెచ్ డిమాండ్ చేశారు. అలాగే మోడీ కూడా ఏడాది పాలనలో ఎలాంటి అవినీతి జరగలేదంటూ బాజా మోగించాడని, అలాంటిది లలిత్‌మోడీ, సీఎం చంద్రబాబుల విషయమై ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు. మరి ఇప్పటికైనా పవన్ ఓటుకు నోటు కేసుపై స్పందిస్తారేమో వేచిచూడాలి.