Advertisementt

నాట్స్‌పై ఐఆర్ఎస్ పంజా..!

Fri 19th Jun 2015 08:32 AM
nats irs,americal internal services,balakrishna,indo american cancer hospital  నాట్స్‌పై ఐఆర్ఎస్ పంజా..!
నాట్స్‌పై ఐఆర్ఎస్ పంజా..!
Advertisement

ఒక‌వైపు జులైలో నాట్స్ సంబ‌రాల‌కి లాస్ ఏంజిల్స్‌లో ఏర్పాట్లు జ‌రుగ‌తున్న స‌మ‌యంలోనే, ఆ సంస్థ నిధుల గోల్‌మాల్‌పై చ‌ర్య‌లు ప్రారంభించిన‌ట్లు అమెరిక‌ల్ ఇంట‌ర్న‌ల్ స‌ర్వీసెస్ (ఐఆర్ఎస్‌) అధికారికంగా తెలిపింది. 

నాన్ ప్రాఫిట్ సంస్థ అయిన నాట్స్ నిధులు వ్య‌క్తిగ‌త అకౌంట్ల‌లోకి త‌ర‌లిపోవ‌డం, కొన్ని స్వచ్ఛంధ సంస్థ‌లకు ఎలాంటి అనుమ‌తులు లేకుండా నిధులు మ‌ళ్లించ‌డంపై IRS ఎంక్వైరీ మొద‌లుపెట్టింది. దీంతోపాటు, నాట్స్‌కి నిధులు స‌మ‌కూర్చిన వారు ఏ ఆదాయ మార్గాల‌ను అనుస‌రించి నిధులు స‌మ‌కూర్చార‌నే విష‌యంలో కూడా ప‌రిశోధ‌న మొద‌లు పెట్టారు. 

IRS నిర్ణ‌యంతో నాట్స్‌కు నిధులివ్వాల‌నుకునే వారితోపాటు ఇప్ప‌టికే నిధులిచ్చిన వారు కూడా గంద‌ర‌గోళంలో ప‌డ్డారు. డిపార్ట్‌మెంట్ ఆఫ్ ట్రెజ‌రీ ఆధ్వ‌ర్యంలో ప‌నిచేసే  IRS నేరుగా బ్యాంక్ ఖాతాల నుంచి వివ‌రాలు సేక‌రించ‌డం మొద‌లుపెట్టింద‌ని తెలిసి త‌మ అకౌంట్‌లు స‌రిచూసుకునే ప‌నిలో ప‌డ్డారు అమెరిక‌న్ తెలుగువారు. 

నాట్స్ సంబ‌రాల‌కి హాజ‌ర‌వుతున్న‌వారు కూడా నేరుగా నాట్స్ అకౌంట్స్ నుంచి ఎలాంటి ఆర్ధిక లావాదేవీలు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డుతున్నారు. హీరో బాల‌కృష్ణ కూడా ఇదే విష‌యాన్ని త‌న సన్నిహితుల‌తో చ‌ర్చించిన‌ట్లు స‌మాచారం. అమెరికాలో మూడు కార్య‌క్ర‌మాల ద్వారా ఇండో అమెరిక‌న్ క్యాన్స‌ర్ ఆసుప‌త్రికి స‌హ‌క‌రించిన నిధుల‌కు, నాట్స్ సంస్థ‌కు ఎలాంటి సంబంధం లేకుండా చూడాల‌ని త‌న అనుచ‌రుల‌తో బాల‌కృష్ణ చెప్పిన‌ట్లు తెలుస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement