సూపర్‌స్టార్ మహేష్ హీరోగా ‘మిర్చి’ ఫేమ్ కొరటాల శివ దర్శకత్వంలో మైత్రి మూవీ మేకర్స్ అండ్ ఎం.బి. ఎంటర్‌టైన్‌మెంట్స్ ప్రై. లిమిటెడ్ నిర్మిస్తున్న ‘శ్రీమంతుడు’ నైజాం ఏరియా రైట్స్‌ను 14 కోట్ల 40 లక్షలకు ఎన్‌ఆర్‌ఎ బేసిస్‌లో అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ స్వంతం చేసుకున్నారు. నవీన్ ఏర్నేని, యలమంచిలి రవిశంకర్, మోహన్ (సివిఎమ్)నిర్మిస్తున్న ‘శ్రీమంతుడు’ చిత్రం నైజాం రైట్స్ పొందిన అభిషేక్ పిక్చర్స్ అభిషేక్ మాట్లాడుతూ ` ‘‘మహేష్‌బాబుగారి ‘శ్రీమంతుడు’ నైజాం ఏరియా రైట్స్ మాకు దక్కినందుకు చాలా ఆనందంగా వుంది. డెఫినెట్‌గా ఈ చిత్రం సెన్సేషనల్‌హిట్ అవుతుంది. ఈ సందర్భంగా నిర్మాతలకు, మహేష్‌బాబుగారికి, కొరటాల శివగారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’’ అన్నారు. జూలై 18న ఆడియో, ఆగస్ట్ 7న సినిమా విడుదలవుతున్న విషయం తెలిసిందే.