Advertisementt

''శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం'' లోగో లాంచ్..!

Thu 18th Jun 2015 03:42 PM
sree adhibhatla sree kalapeetam,karate kalyani,chandrabose  ''శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం'' లోగో లాంచ్..!
''శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం'' లోగో లాంచ్..!
Advertisement
Ads by CJ

హరికథా గానం అనేది ఓ సాంస్కృతిక కళ. ఆ కళతో జీవితంలో మంచి స్థాయికి ఎదిగిన ఎందరో వ్యక్తులున్నారు. కాని ప్రస్తుతం ఉన్న యువతకు గాని, పెద్దవారు గాని దానిపట్ల ఆశక్తి కనబరుచుటలేదు. ఈ కళను ప్రజలకు తెలియబరచాలనే ఉద్దేశ్యంతో నటి కరాటే కల్యాణి 'శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం' అనే ఓ మహత్తర కార్యక్రమాన్ని చేపట్టారు. 108 గంటల పాటు ఈ పీఠంలో 'అష్టోత్తర శత' నిర్విరామ హరికథా గాన యజ్ఞం జరుగనుంది. చంద్రబోసు గారు ఈ యజ్ఞానికి సంబందించిన లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కరాటే కల్యాణి మాట్లాడుతూ "నేనొక హరికథా కళాకారిణిని. మా తండ్రిగారు నాకు ఈ కళను నేర్పించారు. ఈ కళ సహాయంతోనే నేను సినిమా రంగంలో అడుగుపెట్టాను. హరికథ అనేది మన సంస్కృతిలో భాగం. ఆధ్యాత్మికమైనది. ఇప్పుడు ఈ కళపై ఎవరు ఆశక్తి చూపించట్లేదు. 2011 లో వైజాగ్ లో  'శ్రీ ఆదిభట్ల శ్రీ కళాపీఠం' ను స్థాపించాను. నా వంతు భాగంగా ఈ యజ్ఞాన్ని ప్రారంభిస్తున్నాను. 108 గంటల పాటు నిర్విరామంగా ఈ కార్యక్రమం జరగనుంది. 20 జూన్ నుండి 25 జూన్ వరకు ఈ యజ్ఞం జరుగుతుంది. హైదరాబాద్ లో ఈ మహత్తర కార్యక్రమాన్ని నిర్వహిస్తే అందరికి రీచ్ అవుతుంది. ప్రపంచంలో ఎక్కడ ఎవరు ఈ విదమైనటువంటి కార్యక్రమాన్ని చేపట్టలేదు. ఈ యజ్ఞాన్ని లిమ్కా, గిన్నిస్ బుక్ రికార్డ్స్ కు అటెంప్ట్ చేస్తున్నాం" అని చెప్పారు. 

చంద్రబోసు మాట్లాడుతూ "ఆదిభట్ల నారాయణదాసు గారి పేరుతో ఈ కార్యక్రమం చేపట్టడం చాలా ఆనందంగా ఉంది. హరికథలను వింటూనే నేను చిన్నప్పటినుండి పెరిగాను. ఈరోజు నేను సాహిత్యం రాస్తున్నానంటే దానికి కారణం హరికథలే. ఈ కళను ప్రపంచానికి తెలియబరచడానికి కల్యాణి గారు ఇలాంటి కార్యక్రమాన్ని చేపట్టడం అభినందించాల్సిన విషయం" అని చెప్పారు.

గంగాధరశాస్త్రి మాట్లాడుతూ "హరికథ కళాకారిణిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టి మూలాల్ని మర్చిపోకుండా తరువాతి తరాలకు ఈ కళను అందించాలనే ఉద్దేశ్యంతో కల్యాణి గారు ప్రారంభిస్తున్న ఈ కార్యక్రమం విజవంతం అవ్వాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను" అని చెప్పారు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ