నాగాన్వేష్, కృతిక జంటగా సరస్వతి ఫిల్మ్స్ పతాకంపై జి.రామ్ ప్రసాద్ దర్శకత్వంలో 'సింధూరపువ్వు' కృష్ణారెడ్డి నిర్మిస్తున్న సినిమా 'వినవయ్యా రామయ్యా'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తిచేసుకొని జూన్ 19న విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సందర్భంగా హీరో నాగాన్వేష్ తో సినీజోష్ ఇంటర్వ్యూ..
సినిమా ఎలా ఉండబోతోంది..?
ఇదొక కుటుంబ కథా చిత్రం. చంటి(హీరో) అనే కుర్రాడు జానకి అనే అమ్మాయిని ప్రేమిస్తాడు. కాని జానకి తననొక స్నేహితుడిలా మాత్రమే చూస్తుంది. కథ అలా నడుస్తున్నప్పుడు హీరో ఓ సమస్యలో ఇరుక్కుంటాడు. ఆ సమస్యను చేదించి తన ప్రేమను గెలుచుకున్నడా.. లేదా.. అనేదే ఈ సినిమా. కమర్షియల్ ఫార్మాట్ లో ఉంటుంది. ఫస్ట్ హాఫ్ చాలా ఎంటర్ టైనింగ్ గా సాగుతుంది. క్లైమాక్స్ సీన్స్ లో మంచి ఫీల్ ఉంటుంది. సినిమాలో నా క్యారెక్టర్ పేరు చంటి. ఫన్ లవింగ్ క్యారెక్టర్. ప్రతీది చాలా తేలికగా తీసుకునే పర్సన్.
ఈ టైటిల్ పెట్టడానికి కారణం..?
ఈ సినిమాలో హీరో తనకు ఎలాంటి సమస్య వచ్చినా దేవుడు శ్రీరాముడుకు చెప్పుకుంటూ ఉంటాడు. సినిమా అంతా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో సాగుతుంది. ఈ సినిమాకు 'వినవయ్యా రామయ్య' టైటిల్ యాప్ట్ అవుతుందని సెలెక్ట్ చేసుకున్నాం.
హీరోగా నటించాలనే ఆలోచన ఎలా వచ్చింది..?
చిన్నప్పటి నుండి సినిమా వాతావరణంలో పెరగడం వలన నాకు తెలియకుండానే సినిమాలపై ఇంట్రెస్ట్ మొదలయింది. నాన్నగారు ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలను నిర్మించారు. ఆయన నిర్మించిన ఓ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించాను. ఆ సినిమా ద్వారా నాకు ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలో చేసే అవకాశం వచ్చింది. ఆ తరువాత చదువు పూర్తి చేసుకోవాలని గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసాను. హీరో అవ్వాలనే కోరిక నాలో చిన్నప్పటినుండి ఉంది. నటనలో శిక్షణ పొందడానికి బొంబాయి వెళ్లి సంవత్సరన్నర పాటు యాక్టింగ్ కోర్సెస్ చేసాను. డాన్సు చిన్నప్పటినుండి నేర్చుకున్నాను. రీసెంట్ గా ఫైట్స్ నేర్చుకున్నాను.
సీనియర్ ఆర్టిస్టులతో నటించడం ఎలా అనిపించింది..?
మొదట చాలా భయపడ్డాను. ఎక్కువ రీటేక్స్ తీసుకుంటే కోప్పడతారనుకున్నాను. కాని రీటేక్స్ తీసుకోలేదు. పైగా ప్రకాష్ రాజ్ గారు, బ్రహ్మానందం గారు సెట్స్ లో నాకు చాల ఆహేల్ప్ చేసారు. వారి సలహాలు చాలా ఉపయోగపడ్డాయి.
డైరెక్టర్ రామ్ ప్రసాద్ గారితో వర్క్ చేయడం ఎలా అనిపించింది..?
రామ్ ప్రసాద్ గారి సినిమాలు కామెడీ గా ఉంటూ మంచి ఫీల్ తో ఎండ్ అవుతాయి. ఈ సినిమా కూడా అదే కోవలోకి వస్తుంది. ఆయనపై చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాను. పాత్రకు తగిన విధంగా నన్ను మౌల్ద్ చేసి డైరెక్ట్ చేసారు.
మీ సొంత బ్యానర్ లో చేయడానికి కారణం..?
నా మొదటి సినిమా నాన్నగారి బ్యానర్ లోనే చేయాలని డిసైడ్ అయ్యారు. ఈ సినిమా కోసం ఆయన 24 క్రాఫ్ట్స్ లో చాలా కష్టపడ్డారు. చిన్న చిన్న విషయాల పట్ల కూడా చాలా పర్టిక్యులర్ గా ఉంటారాయన. ఎక్కడ కాంప్రమైస్ అవ్వకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు.
వి.వి.వినాయక్ సినిమా చూసారా..?
చూసారు. ఈ సినిమా పోస్టర్, సాంగ్ ప్రోమో విడుదలయిన్నప్పుడే ఆయన నాకు ఫోన్ చేసి బీగిబీగి సాంగ్ చాలా బావుందని, డాన్సు అధ్బుతంగా చేసావని చెప్పారు. సినిమా చూసిన తరువాత మంచి ఫ్యామిలీ ఎంటర్ టైనింగ్ మూవీ. బాగా నటించావు అని చెప్పారు.
ఎలాంటి సినిమాలు చేయాలనుకుంటున్నారు..?
నా కెరీర్ ఇప్పుడే మొదలయింది. ఇమేజ్ కోసం ఆలోచించట్లేదు. ప్రేక్షకులు నా నుంచి కంటెంట్ ఎక్స్ పెక్ట్ చేసే సినిమాలను మాత్రమే చేయాలనుకుంటున్నాను. హీరో ధనుష్ ను తీసుకుంటే తను నెక్ట్స్ ఎలాంటి సినిమాలో నటిస్తాడో గెస్ చేయలేం. ఆయనలా విభిన్నంగా ఉండే చిత్రాలలో నటించాలనుంది.
నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?
నాలుగు కాన్సెప్ట్స్ లైన్ లో ఉన్నాయి. రెండు కథలు మాత్రం చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాయి. రెండు హిట్ సినిమాలు ఇచ్చిన డైరెక్టర్ తో 15 కోట్లతో ప్రాజెక్ట్ మొదలుపెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఆ విషయాలు త్వరలోనే అఫీషియల్ గా అనౌన్స్ చేస్తాం.