జాతీయ పతాకాన్ని అవమానించినందుకు ఘజియాబాద్ కోర్టులో అమితాబ్, అభిషేక్ బచ్చన్‌లపై కేసు నమోదైంది. 2015 ఫిబ్రవరిలో అడిలైడ్‌లో జరిగిన ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్‌ని వీక్షించడానికి వచ్చిన ఈ ఇద్దరూ భారత జాతీయ జెండాను అవమానించే విధంగా ధరించి కనిపించారని, అంతర్జాతీయ స్థాయిలో పేరున్న ఇద్దరు నటులు ఈవిధంగా జాతీయ పతాకాన్ని అవమానించడాన్ని తప్పు పట్టిన చేతన్ ధిమన్ అనే వ్యక్తి కోర్టును ఆశ్రయించడంతో వారిపై కేసు నమోదైంది.
తను, తన ఫ్రెండ్స్ ఆ మ్యాచ్ చూడడానికి వెళ్ళినపుడు అక్కడ అమితాబ్, అభిషేక్ జాతీయ జెండాను డ్రెస్‌గా చుట్టుకొని కనిపించారని చేతన్ థిమన్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. 1971 యాక్ట్ ప్రకారం జాతీయ పతాకాన్ని అవమానించడం, 2002 ఫ్లాగ్ కోడ్ ఆఫ్ ఇండియా.. ఈ రెండు కేసులను అమితాబ్, అభిషేక్‌లపై నమోదు చేశారు. దీనికి సంబంధించిన సమన్లను ఇప్పటికే కోర్టు వారికి పంపించింది. మరి తండ్రీ కొడుకులు ఈ కేసును ఎలా ఎదుర్కొంటారో వెయిట్ అండ్ సీ.