ఓటుకు నోటు కేసులో ఓవైపు జగన్‌మోహన్‌రెడ్డి, ఆయన పార్టీ నాయకులు చంద్రబాబును, టీడీపీని దుమ్మెత్తి పోస్తున్నారు. అయితే అదే సమయంలో జగన్ పార్టీకి చెందిన ప్రధాన నాయకుడికి కోర్టు జైలుశిక్ష విధించింది.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తెలంగాణలో ముఖ్యంగా మైనార్టీ వర్గంలో మాజీ ఎమ్మెల్సీ రహ్మాన్ ముఖ్య నాయకుడిగా ఉన్నారు. ఈయన పలుమార్లు వైసీపీ తరఫున, జగన్ తరఫున చానళ్లల్లో చర్చ వేదికల్లో కూడా పాల్గొన్నారు. అయితే ఇప్పుడు రహ్మాన్‌కు రంగారెడ్డి జిల్లా 5వ కోర్టు ఏడాది జైలు శిక్ష విధించింది. అంతేకాకుండా భారీ జరిమానా కూడా విధించింది. చెక్‌బౌన్స్ కేసులో రహ్మాన్‌కు కోర్టు ఈ మేర శిక్ష విధించింది. 2009లో శ్రీనివాస్‌గౌడ్ అనే వ్యక్తికి రహ్మాన్ ఇచ్చిన చెక్కు చెల్లలేదు. దీంతో బాధితుడు కోర్టును ఆశ్రయించాడు. ఈ కేసు పూర్వాపరాలు పరిశీలించిన కోర్టు రహ్మాన్‌కు ఏడాది జైలుశిక్షతోపాలు రూ. 44 లక్షల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పింది. మరి తమ పార్టీకి చెందిన నాయకుడికి పడ్డ జైలుశిక్షను వైసీపీ ఎలా సమర్థించుకుంటుందని టీడీపీ నాయకులు ప్రశ్నిస్తున్నారు.