Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- లగడపాటి శ్రీధర్

Sat 13th Jun 2015 08:04 AM
lagadapati sridhar,krishnamma kalipindi iddarinee,sudheer babu  సినీజోష్ ఇంటర్వ్యూ- లగడపాటి శ్రీధర్
సినీజోష్ ఇంటర్వ్యూ- లగడపాటి శ్రీధర్
Advertisement
Ads by CJ

పది సంవత్సరాలుగా తెలుగు చలన చిత్ర పరిశ్రమలో పని చేస్తూ 'ఎవడి గోల వాడిదే' , 'స్టైల్', 'పోటుగాడు' వంటి హిట్ చిత్రాలను తెలుగు ప్రేక్షకులకు అందించిన నిర్మాత లగడపాటి శ్రీధర్. ప్రస్తుతం ఆయన నిర్మించిన 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. జూన్ 14న లగడపాటి శ్రీధర్ పుట్టినరోజు సందర్భంగా ఆయన నిర్మిస్తున్న చిత్ర విశేషాల గురించి తెలిపారు. 

ఈ సినిమా ఎలా ఉండబోతోంది..?

చక్కని లవ్‌ ఎంటర్‌టైనరిది. ఎటువంటి వల్గారిటీ లేకుండా అద్భుతంగా తెరకెక్కించాం. కుటుంబ సమేతంగా చూడదగిన విధంగా ఉంటుంది. నాకు ప్రేమ సినిమాలు అంటే నచ్చవు. కాని చంద్రు గారు కన్నడలో తెరకెక్కించిన 'చార్మినార్' చిత్రం చూడగానే ఆ కథతో ప్రేమలో పడిపోయాను. మంచి ఎమోషనల్ ఫీల్ ఉన్న చిత్రమిది. 'మైనే ప్యార్ కియా' , 'టైటానిక్' వంటి సినిమాలు మన మనసుల్లో ఎలా నిలిచిపోయాయో 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' కూడా అదే విధంగా నిలుస్తుంది.

సుదీర్ బాబు, నందిత హిట్ కాంబినేషన్ అని తీసుకున్నారా..?

వారిద్దరిలో చాలా టాలెంట్ ఉంది. సినిమా పట్ల కమిట్మెంట్ తో ఉంటారు. అందుకే సెలెక్ట్ చేసుకున్నాను. ఈ సినిమాతో సుదీర్ కు మంచి పేరు వస్తుంది. నందిత ఈ చిత్రంలో బాగా నటించింది. సుదీర్ కు, నందితకు మధ్య కెమిస్ట్రీ అధ్బుతంగా పండింది. 

ఈ టైటిల్ పెట్టడానికి కారణం ఏంటి..?

నదులు చాలా  పవిత్రమైనవి. మనమంతా వాటిని దైవస్వరూపాలుగా కొలుస్తాం. నా దృష్టిలో ప్రకృతి, ప్రేమ కూడా దైవస్వరూపాలే. కృష్ణమ్మ నది లాంటి ఓ స్వచ్చమైన ప్రేమ ఎన్ని మలుపులు తిరిగి విజయం సాధించిందనేదే ఈ సినిమా మెయిన్ పాయింట్. సినిమా అంతా రివర్ బ్యాక్ డ్రాప్ లో జరుగుతుంది. అందుకే ఈ సినిమాకు 'కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ' అనే టైటిల్ ను సెలెక్ట్ చేసుకున్నాం.

కన్నడ చిత్రాన్ని తెలుగు తీయడానికి స్టొరీలో ఏమైనా మార్పులు చేసారా..?

కన్నడంలో సినిమా చూసాక ఓ మెయిన్ పాయింట్ తీసుకొని స్టొరీ డెవలప్ చేసాం. కన్నడ చిత్రానికి ఈ చిత్రానికి పోలిక ఉండదు. తెలుగు నేటివిటీ తగ్గట్లుగా చిత్రాన్ని రూపొందించాం. 

కన్నడలో డైరెక్ట్ చేసిన చంద్రు తోనే తెలుగులో కూడా డైరెక్ట్ చేయించారు. దానికి కారణం..?

ఒరిజినల్ సోల్ అనేది సినిమాలో కనిపించాలనే ఉద్దేశ్యంతో చంద్రు నే తెలుగులో డైరెక్ట్ చేయమని అడిగాను. కన్నడలో ఆయన దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి అవార్డులు కూడా వచ్చాయి. సినిమా స్క్రిప్ట్ పై ఆయనకు చాలా క్లారిటీ ఉంది. అందుకే ఆయన్నే సెలెక్ట్ చేసుకున్నాను. నేను నిర్మించిన 'పోటుగాడు' చిత్రం కూడా ఒరిజినల్ డైరెక్టర్ తోనే చేసాను.

రిలీజ్ చేయడానికి ఎందుకు లేట్ చేసారు..?

మొదట ఈ చిత్రాన్ని మార్చి నెలలో రిలీజ్ చేయాలని ప్లాన్ చేసుకున్నాం. అయితే ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అనేది చాలా ముఖ్యం. సినిమాలో ఆర్ఆర్ విన్న తరువాత నాకు సంతోషంగా అనిపించలేదు. అందుకే మరలా ఆర్ఆర్ వర్క్ మీద కాన్సన్ట్రేట్ చేసి కొత్తగా యాడ్ చేసాం. అందువలనే సినిమా రిలీజ్ లేట్ అయింది.

సుదీర్ బాబు లవ్ స్టొరీకు ఎంత వరకు యాప్ట్ అనుకుంటున్నారు..?

సుదీర్ బాబు ఇప్పటి వరకు ఫుల్ లవ్ సబ్జెక్ట్ లో నటించలేదు. ఈ సినిమాలో ఆయన నటన తెలుగు ప్రేక్షకులకు, క్రిటిక్స్ కు చాలా సర్ప్రైసింగ్ గా ఉంటుంది. ఈ సినిమా సుదీర్ బాబు కెరీర్ లో మైల్ స్టోన్ గా నిలుస్తుంది. అంత అధ్బుతంగా నటించాడు.

విశాల్ తో సినిమా ఎప్పుడు..?

లింగుస్వామి దర్శకత్వంలో తెలుగు, తమిళ భాషల్లో విశాల్ హీరోగా ఓ చిత్రాన్ని నిర్మించాలనుంది. ప్రస్తుతం విశాల్ 'పందెం కోడి2' చిత్ర షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. 

నెక్స్ట్ ప్రాజెక్ట్స్..?

'గోలిసోడా' అనే తమిళ చిత్ర రీమేక్ రైట్స్ కొన్నాను. అదొక రివెంజ్ ఫార్ములా సినిమా.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ