Advertisementt

ఇక టీడీపీకి బీజేపీ రాంరాం..!!

Thu 11th Jun 2015 03:18 AM
tdp,bjp,trs,join,nda  ఇక టీడీపీకి బీజేపీ రాంరాం..!!
ఇక టీడీపీకి బీజేపీ రాంరాం..!!
Advertisement

కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్‌డీఏలో చేరడానికి టీఆర్‌ఎస్‌ ఉవ్విలూరుతోంది. ఈ విషయమై పలుమార్లు ఎంపీ కవిత స్పందిస్తూ బీజేపీ ఆహ్వానిస్తే కేంద్రంలో చేరడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని చెప్పింది. అయితే అటు వెంకయ్యనాయుడు ఇటు చంద్రబాబు టీఆర్‌ఎస్‌ను బీజేపీ దరిదాపుల్లోకి కూడా రాకుండా చూసే విషయంలో ఈ ఏడాదిపాటు విజయం సాధించారు. మరి ఓటుకు నోటు కేసులో నల్ల మరక అంటించుకున్న చంద్రబాబును ఇప్పుడు బీజేపీ భరిస్తుందా అనేది ఆసక్తికరంగా మారింది.

తన ఏడాది పాలనలో తన ప్రభుత్వానికి అవినీతి మరక అంటలేదంటూ మోడీ సర్కారు ప్రచారం ఊదరగొట్టింది. అంతేకాకుండా ఎన్నికలకు ముందు కూడా అవినీతి రహిత పాలన అందిస్తామంటూ హామీలిచ్చి బీజేపీ అధికారంలోకి వచ్చింది. అయితే ఓటుకు నోటు కేసులో చంద్రబాబును రక్షిస్తే.. బీజేపీ ప్రభుత్వం సంకటంలో పడే అవకాశముంది. దీనికి బదులుగా ఈ విషయానికి సంబంధించి మిన్నకుండిపోయి టీడీపీని దూరం చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆపై తెలంగాణలో టీఆర్‌ఎస్‌.. ఏపీలో వైసీపీలు పరుగెత్తుకొచ్చి బీజేపీలో చేరుతాయన్న నమ్మకం వారికి ఉంది. ప్రస్తుత పరిణామాలను చూస్తే భవిష్యత్తులో బీజేపీకి టీడీపీ దూరమై.. టీఆర్‌ఎస్‌ దగ్గరయ్యే అవకాశాలున్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇటు చంద్రబాబును ఇరకాటంలోకి నెట్టి.. అటు తన కుమార్తెకు కేంద్ర మంత్రి పదవి లభిస్తే.. కేసీఆర్‌ ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టినట్లే..!

Tags:   TDP, BJP, TRS, JOIN, NDA
Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement