ఫోన్ సంభాషణలతో అడ్డంగా దొరికిపోయిన చంద్రబాబును ఎలా వెనక వేసుకురావాలో అర్థంకాక తెలుగు తమ్ముళ్లు తలల పట్టుకుంటున్నారు. అటు రేవంత్‌రెడ్డి బేరసారాలు.. ఇటు చంద్రబాబు ఫోన్ సంభాషణల వంటి కీలక ఆధారాలు లభ్యమైనప్పుడు తాము ఈ వార్తలను ఎలా ఖండించాలో అర్థంకాక సతమతమవుతున్నారు. దీనికి ప్రత్యామ్నాయంగా సమాధానం చెప్పకుండా ప్రతిదాడి చేయడమే మేలన్న నిర్ణయానికి వారు వచ్చారు. ఎన్నికల తర్వాత టీడీపీ సభ్యుల సంఖ్య 15 నుంచి 10కి తగ్గిపోయిందని, మిగిలిన ఐదు మంది ఎమ్మెల్యేలకు కేసీఆర్ ఏం ముడుపులు ఇచ్చి టీఆర్‌ఎస్ పార్టీలో చేర్చుకున్నారంటూ ప్రశ్నించారు. చంద్రబాబుకంటే ముందు కేసీఆర్‌పై కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు ఏపీ ప్రభుత్వ సలహాదారు పరకాల ప్రభాకర్ వాదన మరోలా ఉంది. అసలు ఫోన్‌లో ఉన్న సంభాషణలు చంద్రబాబువి కావని ఆయన అంటున్నాడు. అక్కడక్కడ ముక్కలుగా మాట్లాడిన మాటలను తీసుకొచ్చి చంద్రబాబును ఇరికించారనేది ఆయన వాదన. ఇక వైసీపీ విషయానొకస్తే ఆ పార్టీలో ఉన్న నాయకులంతా ఇతర పార్టీలనుంచి వలస వచ్చిన వారేనని, తమ అధినేత గురించి ఏడాదిపాటు జైలుశిక్ష అనుభవించిన జగన్‌కు లేదని వారు