Advertisement

టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నిప్పుపెట్టిన 'సాక్షి'..!!

Mon 08th Jun 2015 01:33 AM
sakshi media,trs mla,madanlal,shanker nayak,revanth reddy  టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నిప్పుపెట్టిన 'సాక్షి'..!!
టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలకు నిప్పుపెట్టిన 'సాక్షి'..!!
Advertisement

తెలంగాణలో టీఆర్‌ఎస్‌కు సాక్షి దినపత్రిక అనుకూలంగా వ్యవహరిస్తుందనేది ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు. పైస్థాయిలో జగన్‌, కేసీఆర్‌ల మధ్య కొనసాగుతున్న మైత్రి బంధమే.. పత్రిక, టీఆర్‌ఎస్‌ల మధ్య కూడా కొనసాగుతున్నాయి. అయితే చంద్రబాబును దోషిగా నిలబెట్టే ప్రయత్నంలో తమను 'సాక్షి' పత్రిక ఇరుకున పెడుతోందని టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు.

రేవంత్‌రెడ్డి కేసుకు సాక్షి మీడియా భారీ ప్రచారాన్ని కల్పిస్తోంది. ఈ సంఘటన జరిగిన నాటినుంచి కూడా ఈ మీడియాలో ప్రధాన వార్తగా ఇదే విషయాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఒక్క స్టీఫెన్‌తోనే కాకుండా మొత్తం 8 మంది ఎమ్మెల్యేలతో బాబు బేరసారాలు కొనసాగించినట్లు ఈ పత్రిక వార్తలు ప్రచురిస్తోంది. చంద్రబాబు ఆదేశాలతో రేవంత్‌, ఎర్రబెల్లి, రమణ తదితరులు 8 మంది ఎమ్మెల్యేలతో బేరాలు కొనసాగించినట్లు ఈ పత్రిక వార్త కథనాన్ని ప్రచురించి వారికి అడ్వాన్స్‌లుకూడా చెల్లించినట్లు చెప్పుకొచ్చింది. అంతేకాకుండా ఆ ఎనిమిది మంది ఎమ్మెల్యేల్లో కొందరి పేర్లు కూడా రాసుకొచ్చింది. అలా టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మదన్‌లాల్‌, శంకర్‌నాయక్‌ల పేర్లు బయటకొచ్చాయి.

దీనిపై టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు మండిపడుతున్నారు. తాము ఎవరితోనూ బేరసారాలు కొనసాగించలేదని, సాక్షిలో అసత్యపు వార్తలు ప్రచురిస్తున్నారంటూ వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే వైరాలో సాక్షి దినపత్రిక ప్రతులను ఎమ్మెల్యే మదన్‌లాల్‌ అనుచరులు తగులబెట్టారు. తాజాగా ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ కూడా మీడియాతో మాట్లాడుతూ.. తాను ఎవరితోనూ బేరసారాలు కొనసాగించలేదని, తాను బతికున్నంత కాలం కేసీఆర్‌తోనే ఉంటానని స్పష్టం చేశారు. బాబుకు నిప్పుపెట్టాలన్న తొందరలో 'సాక్షి' టీఆర్‌ఎస్‌ను ఇరుకున పడేసినట్లు కనిపిస్తోంది.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement