Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ- దిల్ రాజు(కేరింత)

Sat 06th Jun 2015 10:34 PM
kerintha,dil raju,saikiran adavi,jun12th release  సినీజోష్ ఇంటర్వ్యూ- దిల్ రాజు(కేరింత)
సినీజోష్ ఇంటర్వ్యూ- దిల్ రాజు(కేరింత)
Advertisement
Ads by CJ

సుమంత్ అశ్విన్, శ్రీదివ్య, తేజస్వి ప్రధాన పాత్రల్లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై అడవి కిరణ్ దర్శకత్వంలో దిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 'కేరింత'. ఈ సినిమా అన్ని కార్యక్రమాలు ముగించుకొని జూన్ 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా నిర్మాత దిల్ రాజుతో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమా ఎలా ఉండబోతోంది..?

మూడు సంవత్సరాల క్రితం అందరు కొత్తవాళ్ళతో ఓ సినిమా చేయాలనుకున్నాను. ఆ సమయంలో సాయికిరణ్ రెండు కోట్లలో ఓ ప్రాజెక్ట్ ఉంది వింటారా అని అడిగాడు. సాయి డైరెక్ట్ చేసిన వినాయకుడు మూవీ ఆంధ్రప్రదేశ్ లో మేమే డిస్ట్రిబ్యూట్ చేసాం. ఆ సినిమా నాకు నచ్చింది. ఈ సినిమా స్టొరీ సాయి చెప్పగానే ఓకే చెప్పాను. మొత్తం అందరు కొత్తవాళ్ళయితే ఆడియన్స్ కు రీచ్ అవుతుందో లేదో అని అశ్విన్ ను, శ్రీదివ్యను సెలెక్ట్ చేసాం. ముగ్గురు హీరోలు, ముగ్గురు హీరోయిన్లతో ఈ చిత్రాన్ని తెరకెక్కించాం. నిజమైన స్నేహం, ప్రేమ అంశాలతో సినిమా కథ సాగుతుంది. ఈ చిత్రానికి సంగీతం అందివ్వడానికి మిక్కి జె మేయర్ రెండు సంవత్సరాలుగా పని చేస్తున్నాడు. మా బ్యానర్ లో మిక్కి సంగీతం అందించిన సినిమాలు కొత్త బంగారులోకం, సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు మ్యూజికల్ గా హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం కూడా అదే కోవలోకి వస్తుందని భావిస్తున్నాను. ఈ సినిమాలో మొత్తం ఆరు పాటలు ఉన్నాయి. అందులో ఖచ్చితంగా రెండు, మూడు పాటలు ఈ సంవత్సరం అంతా వినిపిస్తూనే ఉంటాయి.

సాయికిరణ్ చెప్పిన కథలో ఏమైనా మార్పులు చేసారా..?

మేము సినిమా చేయాలనుకునే సమయంలో 'ఓ మై ఫ్రెండ్' సినిమా రిలీజ్ అయింది. ఆ సినిమా కొందరికి నచ్చింది కొందరికి నచ్చలేదు. మిశ్రమ స్పందన వచ్చింది. ఈ టైంలో ఎక్స్ పెరిమెంటల్ సినిమా చేయాలా అని ఆలోచించి సాయి కిరణ్ చెప్పిన స్టొరీ లో కొన్ని మార్పులు చేసాం. కాలేజ్ బ్యాక్ గ్రౌండ్ సినిమా అంటే అందరికీ హ్యాపీడేస్ చిత్రం గుర్తొస్తుంది. ప్రేక్షకులు మా చిత్రం చూసి అలా ఫీల్ అవ్వకుండా ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నాను. ప్రతి మనిషికి ఓ బ్యాచ్ అనేది ఉంటుంది. ఆ బ్యాచ్ లో ఓ సరైన వ్యక్తుంటే అందరు ఎలా మరుతారనేది ఈ చిత్రంలో చూపించాం.

'కేరింత' సినిమా చేయడానికి కారణం..?

ఆర్య, బొమ్మరిల్లు, కొత్తబంగారులోకం సినిమాలు నా కెరీర్ లోనే బెస్ట్ ఫిల్మ్స్. ఆ తరువాత నేను చేసిన సినిమాలన్నీ స్టార్ కాస్ట్ ఉన్న సినిమాలే. ఐదు నుండి ఆరు సంవత్సరాలుగా నా స్టైల్ లో ఒక సినిమా కూడా చేయలేదు. అందుకే 'కేరింత' కథ వినగానే ఒప్పుకున్నాను. ఈ సినిమాతో నాకు చాలా సంతృప్తి కలిగింది. మొదట ఈ చిత్రం ముప్పై రోజులు షూటింగ్ కంప్లీట్ అవ్వగానే టీం అందరితో కలిసి సినిమా చూసాను. అందరు బావుందని చెప్తుంటే నాకు మాత్రం ఎక్కడో తెలియని అసంతృప్తి నేను అనుకున్నట్లుగా సినిమా రాలేదు. మరలా స్క్రిప్ట్ వర్క్ అంతా పక్కగా చేసుకొని ఆ ముప్పై రోజుల షూటింగ్ రీషూట్ చేసాం. 

సెన్సార్ మీ చిత్రానికి క్లీన్ రిపోర్ట్ ఇచ్చింది. ఎలా ఫీల్ అవుతున్నారు..?

సెన్సార్ సభ్యులు ఈ సినిమా చూసి మమ్మల్ని అప్రిషియేట్ చేసారు. అందులో ఉన్న సభ్యులంతా 50 ఏళ్ళకు పైబడినవారే. వారు ఈ సినిమాను మెచ్చుకోగానే చాలా ఆనందం కలిగింది. మేము తీసింది యూత్ ఫుల్ మూవీ అయినా ఫ్యామిలీ ఆడియన్స్ కు కూడా కనెక్ట్ అవుతుందని తెలుస్తుంది.

మీ సినిమాకు ప్రమోషన్స్ ఎలా ప్లాన్ చేస్తున్నారు..?

బాలీవుడ్ ఇండస్ట్రీతో మన ఇండస్ట్రీ ని పోల్చితే వారికంటే ఐదు సంవత్సరాలు వెనుకబడి ఉంటాం. వారు ప్రమోషన్ చేసే విధానం చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాతో మేము కూడా ఆవిధంగా చేయాలని ప్లాన్ చేస్తున్నాం. ముందుగా అన్ని ప్రాంతాల కళాశాలలో ఓ ఈవెంట్ నిర్వహిస్తున్నాం. మా సినిమాలో ఉన్న  హీరోలు, హీరోయిన్లు డాన్సులు చేస్తారు. వారిలాగా ఎవరు చేస్తారో వారందరినీ సెలెక్ట్ చేసి జూన్ 12న స్పెషల్ ప్రీమియర్ షో వేయనున్నాం. ఆదివారం హైదరాబాద్ లో, సోమవారం వైజాగ్ లో, మంగళవారం విజయవాడ, గుంటూరు జిల్లాలలో, బుదవారం నెల్లూరు, తిరుపతి లలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నాం.

రీసెంట్ గా మీరు ప్రొడక్షన్ లో కొంత గ్యాప్ తీసుకున్నారు. దానికి కారణం..?

2014 లో మా ఊరిలో ఓ గుడి కట్టించాం. నా కూతురి పెళ్లి కూడా పెట్టుకున్నాను. అందుకే కొంచెం గ్యాప్ తీసుకున్నాను. కేరింత మాత్రం ప్రొడక్షన్ లోనే పెట్టుకున్నాను.  

నెక్ట్స్ ప్రాజెక్ట్స్..?

ఈ సంవత్సరం ఆగస్ట్ లో 'సుబ్రహ్మణ్యం ఫర్ సేల్' సెప్టెంబర్ లో సునీల్ సినిమా విడుదల కానున్నాయి. ఆ తరువాత కొత్తవాళ్ళతో 'శతమానంభవతి' అనే చిత్రాన్ని చేస్తున్నాను. అందులో హీరోగా సాయి ధరమ్ తేజ్ సెలెక్ట్ చేయడం జరిగింది. ఆ చిత్రం మూడు జనరేషన్స్ కు సంబంధించి ఉంటుంది. 'కేరింత'కు రచన సహకారం అందించిన వెంకీ ను డైరెక్టర్ గా పరిచయం చేస్తూ మరో చిత్రాన్ని నిర్మించాలనుకుంటున్నాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ