Advertisementt

చిన్న సినిమా కి ఈపధకం ఫలించేనా ?

Wed 03rd Jun 2015 10:32 PM
chinna cinema,tollywood,telugu film industry,digital cinema,small producers  చిన్న సినిమా కి ఈపధకం ఫలించేనా ?
చిన్న సినిమా కి ఈపధకం ఫలించేనా ?
Advertisement

ప్రస్తుతం తెలుగు చలన చిత్ర సీమలో చిన్న సినిమా దాదాపు పాడె ఎక్కిందనే చెప్పాలి.. కళల మీద మక్కువతో మరి ముఖ్యంగా సినిమామీద వ్యామోహంతో సినిమాలు తీయాలని వచ్చేవారు. సినిమా ల్లో నటించాలని వచ్చేవాళ్ళు తమ కోరికలు  తీర్చుకోవడానికి వేదిక చలన చిత్ర పరిశ్రమ ఇక్కడ వేలాది మంది కార్మికులు, నటీనటులు, సాంకేతిక నిపుణులు, రచయితలు ఇలా చాలా మంది పెద్ద వారు చిన్న వారు కళలను ఆస్వాదిస్తూ ఉపాది పొందుతుంటారు.. ఒక పక్క మానసికానందం మరో పక్క ఉపాది. ఈ రెండూ ఒకే చోట దొరుకుతాయి. మామూలుగా ఉపాది వేరే చోట పొందే వారు కూడా వినోదం కోసం ఈ సినిమాలను చూస్తుంటారు. అయితే వినోదం..ఉపాది రెండూ ఒకే చోట దొరికే వేదిక ఏదైనా ఉందా అంటే అది టీవి.. సినిమా రంగాలు మాత్రమే.

అయితే సజావుగా సాగుతున్న ఈ సినిమా రంగంలో స్లంప్‌ అప్పుడప్పుడు వస్తుంటుంది. అది జనరేషన్‌ మారినప్పుడో కొత్త సాంకేతిక అభివృద్ధి జరిగినపుడో ఈ మార్పు సంభవిస్తూ ఉంటుంది. లేకుంటే సినిమాలు మొనాటినిగా ఉన్నప్పుడు కూడా ఇలాంటి పరిస్థితి సంబవిస్తుంటుంది .. అలాంటి సమయంలో వచ్చే స్లంపులు  అన్నీ మళ్ళీ కొన్నాళ్ళకు తిరిగి పుంజుకునేవే అయితే ప్రస్తుతం సినిమా పరిశ్రమలో ఏర్పడ్డ స్లంప్‌ ఏమీ చేసినా పోయేది కాదు. ఎందుకంటే నమ్మకంతో సహకారంగా ఉండే సినిమా పరిశ్రమ వ్యాపార స్వార్థాలతో ముడి పడిరది. 

రాష్ట్రవ్యాప్తంగా ఉండే వందలాది థియేటర్లను కొందరు వ్యక్తులు లీజుకు తీసుకుని నడిపిస్తున్నారు. వారు చెప్పే రెంటుకు థియేటర్‌ను అద్దెకు తీసుకుని సినిమాను ఆడిరచడం చిన్న నిర్మాతలకు అది సాధ్యమయ్యే పని కాదు. అందుకే చాలా మంది సినిమాలు తీసి విడుదల చేసుకోవడానికి చేత కాక తమ సినిమాలను అలాగే వదిలేసుకున్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో  సినిమా తీసి లేని కష్టాలు తెచ్చుకునే దానికంటే సినిమా తీయకుండా ఉండటమే ఉత్తమంగా మరి కొందరు భావిస్తున్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో చిన్న నిర్మాతలు ప్రత్యామ్నాయాన్ని వెతుక్కుంటున్నారు. 

అందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో  దాదాపు 5వేల థియేటర్ల నిర్మాణాన్ని చేపట్టాలని ఒక పథక రచన చేశారు. అందుకు గాను ఈ నెల 4వ తేదీన ఫిలింఛాంబర్‌  ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి థియేటర్‌ నిర్మించడానికి ఉత్సాహం ఉన్న వారిని అక్కడికి వచ్చి  తమ పేర్లను నమోదు చేయించుకోమని నిర్మాతలతో సహా సినిమా పరిశ్రమలో ఉన్న కొందరికి సంక్షిప్త సందేశాలు పంపుతున్నారు. మిని డిజిటల్‌ సినిమా థియేటర్‌ లు నిర్మించాలనే ఆ సక్తి ఉన్న వారు. తమ పేరును నమోదు చేయించుకోండి అని మాత్రమే ఆ సందేశం లో ఉంది. మినీ డిజిటల్‌ థియేటర్లు నిర్మించడం అంత సులువా ..అనే విధంగా ఈ సంక్షిప్త సందేశం ఉంది. అస్సలు ఏంటి ఎలా దీన్ని ముందుకు తీసుకు వెళ్ళాలి అనే విషయాలతో పాటు ఎన్నో సందేహాలు నివృత్తి  కావలసి ఉంది. ఒక వేళ వీరు వేసిన పథకం విజయవంతం అయితే చిన్న సినిమాకు ఊపిరిలు వచ్చి నట్టే అంది ఎంత వరకు సాధ్యమవుతుందో వేచి చూడాలి.

                                                                                       - పర్వతనేని రాంబాబు 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement