Advertisementt

తెలంగాణలో ఎన్టీఆర్‌, ఆంధ్రాలో కెసిఆర్‌ విగ్రహాలు!

Wed 03rd Jun 2015 11:10 PM
ntr,kcr,statues,telangana,andhra pradesh  తెలంగాణలో ఎన్టీఆర్‌, ఆంధ్రాలో కెసిఆర్‌ విగ్రహాలు!
తెలంగాణలో ఎన్టీఆర్‌, ఆంధ్రాలో కెసిఆర్‌ విగ్రహాలు!
Advertisement

వీధివీధికి తెలంగాణలో ఎన్టీఆర్‌, ఆంధ్రాలో కెసిఆర్‌ విగ్రహాలు

దేశంలో ఏ గల్లీకి వెళ్ళినా పల్లెకు వెళ్ళినా హనుమంతుని విగ్రహాలు కనిపిస్తాయి. తెలంగాణలో అయితే గ్రామ దేవతలు కనిపిస్తారు. కానీ ఇప్పుడు నవ్యాంధ్ర శోభ, రియల్‌ బూమ్‌ చూస్తున్న ఆంధ్రుల గుండెల్లో గుడి కట్టింది కెసిఆర్‌కి మాత్రమే. కెసిఆర్‌ లేకుంటే ఇంకో ఏభై ఏళ్ళు తెలంగాణవారి తిట్లు శాపనార్ధాలు ఈసడిరపులు భరిస్తూ హైదరాబాద్‌నే డెవలప్‌చేస్తూ వుండేవాళ్ళం. ఇప్పుడు మనం కాకపోతే రేపు మన పిల్లలయినా తట్టాబుట్ట నెత్తిన పెట్టుకుని తెలంగాణ విడవాల్సివచ్చేది. అదేదో ఇప్పుడే జరగడం మంచిదయింది. కెసిఆర్‌ లేకుంటే మనం కళ్ళు తెరిచేవాళ్ళంగాదు. మన భూములకి రేట్లొచ్చేయిగాదు. కెసిఆర్‌ దేవుడు, కృష్ణానది ఒడ్డున ఆయన విగ్రహం పెట్టాలి - అనుకుంటున్నవారెందరెందరో ఆంధ్రాలో. అలాగే తెలంగాణలో పట్వారీ పద్ధతిని రద్దుచేసి, ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు కల్పించి, తెలంగాణ అభివృద్ధికి పునాదివేసింది ఎన్టీఆర్‌,  హైదరాబాద్‌ని ఓ అంతర్జాతీయ వేదికగా, మిగులు బడ్జెట్‌ వున్న రాష్ట్రంగా అభివృద్ధి చెందడానికి కారకుడు ఎన్టీఆర్‌. తనకు రాజకీయ జన్మనిచ్చిన ఎన్టీఆర్‌కి, తెలంగాణ అభివృద్ధికి కారకుడయిన ఎన్టీఆర్‌కి సవినయంగా, సగర్వంగాసరైన ప్రదేశాలలో సముచితంగా విగ్రహ ప్రతిష్ట చేయాలి కెసిఆర్‌.

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement