ఈ మధ్యకాలంలో ఇంటర్ పూర్తి చేసిన విద్యార్ధులకు ప్రొఫెషనల్ కోర్సులలో అడ్మిషన్ కొరకు ఎంసెట్ పరీక్ష నిర్వహించడం సాధారణమయింది. కానీ ఇటీవల ఎంసెట్ పరీక్షను తీసేసి ఇంటర్ మార్కులు ఆధారంగా ప్రొఫెషనల్ కోర్సులకి ఎంట్రెన్స్ నిర్వహించాలన్న డిమాండు ఊపందుకుంది. కానీ ఇంటర్ పరీక్షలను 1,000 మార్కులకు నిర్వహిస్తారు. ఇంటర్‌కి సమానమయిన ‘సిబిఎస్‌ఇ’ పరీక్షని 500 మార్కులకి, ‘ఐసిఎస్‌ఈ’ పరీక్షను 600 మార్కులకు నిర్వహిస్తున్నారు. ఇంగ్లీషు, హిందీ, తెలుగు మాధ్యమాలలో ఈ పరీక్షలు నిర్వహించడం జరుగుతుంది. సిలబస్‌లో మార్పు వుంది. ప్రాక్టికల్స్‌లో వైవిధ్యం వుంది. ఈ మూడిరటి స్ధానంలో ఓ కామన్ పరీక్ష జరగాలి. అప్పుడే విద్యార్ధులకి న్యాయం జరుగుతుంది. అంతేగాని ‘ఇంటర్, సిబిఎస్‌ఇ, ఐసిఎస్‌ఇ’ అని మూడు తరహా భిన్న పరీక్షలు నిర్వహించి ఆ మార్కులు ఆధారంగా సీట్లు కేటాయిస్తే విద్యార్ధులు నష్టపోవడం ఖాయం. స్టేట్‌న సిలబస్‌కి, సెంట్రల్ సిలబస్‌కి మూలాల్లోనే తేడా వుంది. గమనించాలి.