Advertisementt

విద్యాబాలన్‌కు దక్కిన మరో గౌరవం.!

Wed 03rd Jun 2015 01:31 AM
actress vidyabalan,vidya balan got doctorate,dirty picture heroine vidyabalan  విద్యాబాలన్‌కు దక్కిన మరో గౌరవం.!
విద్యాబాలన్‌కు దక్కిన మరో గౌరవం.!
Advertisement
Ads by CJ

కేరళలో పుట్టి మలయాళ, తమిళ సినిమాల్లో హీరోయిన్‌గా ప్రయత్నించి విఫలమవడంతో ముంబాయి చేరుకున్న విద్యాబాలన్‌ను బాలీవుడ్‌ సాదరంగా ఆహ్వానించింది. లగే రహో మున్నాభాయ్‌, ఓం శాంతి ఓం, డర్టీ పిక్చర్‌ వంటి చిత్రాలతో అందరి దృష్టినీ ఆకర్షించిన విద్యా సినిమాల్లో నటించడమే కాదు ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ తనవంతు సేవ చేస్తోంది. కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన స్వచ్ఛ భారత్‌ కార్యక్రమానికి సంబంధించిన ప్రకటనల్లో రూపాయి కూడా రెమ్యునరేషన్‌ తీసుకోకుండా స్వచ్ఛందంగా నటిస్తూ అందరి అభినందనలు అందుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం నుంచి పద్మశ్రీ అవార్డుతోపాటు మరికొన్ని సంస్థలు అందించిన పురస్కారాలు అందుకున్న విద్యాబాలన్‌ను అహ్మదాబాద్‌లోని రాయ్‌ యూనివర్సిటీ డాక్టరేట్‌తో సత్కరించింది.  

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ