ప్రపంచ దేశాల నాయకులనేకాదు, ప్రపంచ ప్రజల హృదయాలను జయిస్తున్న మోదీ విదేశీ పర్యటనలపై కాంగ్రెసు వ్యంగ్యోక్తులు విసరవచ్చు. కానీ ఓ వైపు చైనా అగ్ర నాయకత్వాన్ని, మరోవైపు అమెరికా అధ్యక్షుడ్ని ప్రభావితం చేసిన వ్యక్తిగా మోదీని చెప్పుకు తీరాల్సిందే. దేశ రాజకీయాలకు వస్తే తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీని కొరకురాని కొయ్యలుగా చెబుతారు. కారణాలు ఏవైతేనేం మోదీపట్ల జయలలిత, మమతా బెనర్జీ దృక్పధాలలో పూర్తి మార్పు కనిపిస్తోంది. అందుకు చక్కని ఉదాహరణ
- మోదీ బంగ్లా పర్యటనలో మమతా బెనర్జీ పాల్గొననుండటం. అలాగే భారత విదేశాంగ విధానంపై పట్టువున్న ఇద్దరు మాజీ ప్రధానులలో ఒకరయిన మన్మోహన్ సింగ్‌ని మోదీ కలవడం జాతిహితం నేపధ్యంగా గొప్ప నిర్ణయం. ఈ విషయంలో మోదీ నిర్ణయాన్ని జాతి యావత్తు ముక్త కంఠంతో అభినందించాలి. మన్మోహన్‌తో మోదీ సమావేశాన్ని రాజకీయం చేయడం, మోదీ చైనా పర్యటన సమయంలోనే చంద్రబాబు పర్యాటక సన్నాహాలను మోదీ నిలిపివేయడానికి రాజకీయ రంగు పులిమితే చేయగలిగిందేమీ లేదు, వారి అపరిపక్వ రాజనీతికి జాలిపడటం మినహా.