చిన్న సినిమాలకు స్వర్ణయుగం.. ఇది నిజమా ? అస్సలు ఇప్పుడున్న పరిస్థితుల్లో .. చిన్న సినిమా బతికి మళ్ళీ బట్ట కడుతుందా? అంటే నిజమే అంటున్నారు ..చిన్న నిర్మాతలు దీనికి కారణం .... చిన్న సినిమాలకు థియేటర్లను తక్కువ లీజుతో .. ఇస్తారా .. లేక ప్రభుత్వం ఏదన్నా రాయితీలు ఇస్తుందా? ఏవిదంగా చిన్న సినిమా మళ్ళీ బతుకుతుంది అనే సందేహాలు చాలా కలుగక మానవు. అయితే ఇవేవి కావు మేమే ఒక కొత్త మార్గాన్ని అనుసరిస్తున్నాము అంటున్నారు చిన్న నిర్మాతలు.
ప్రస్తుతం చిన్న సినిమా మనుగడ కోల్పోయింది. ఒకటి రెండు సినిమాలు తప్ప చిన్న సినిమాలు కూడా ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో చిన్న సినిమా బాగున్నా అడటానికి ప్రస్తుతం ఉన్న లీజు విధానం ప్రధాన అడ్డంకి గా మారింది. దాంతో ఎన్నో సినిమాలు విడుదలకు నోచుకోలేని పరిస్థితి. దాంతో చిన్న నిర్మాతలు అంతా ఏకమై ప్రాంతీయ విభేదాలు లేకుండా .. సంఘటితంగా ఒక మంచి ప్రణాలికను సిద్దం చేసుకున్నారు . అదేమిటంటే చిన్న థియేటర్లను తెలుగు రాష్ర్టాల వ్యాప్తంగా ఏర్పరుచు కోవడం అనడం కంటే చిన్న థిటయేర్లను నిర్మించుకోవడం .. ఒక థియేటర్ నిర్మించాలంటే ఇప్పుడు న్న పరిస్థితుల్లో సాధ్యం కాదు. అయితే ఇప్పుడున్న సాంకేతిక పరిజ్ఞానం తో చిన్న థియేటర్ ను నిర్మించుకోవడం సులువు అంటున్నారు
ఓ పాతిక లక్షలు ఉంటే చాలు చిన్న థియేటర్ ను 150 మంది ప్రేక్షకులు కూర్చుని చూసే విధంగాసినిమా థియేటర్ ను నిర్మించి ఇస్తాము అని బాంబేకు చెందిన ఒక కంపెనీ ముందుకు వచ్చింది. ఆ కంపెనీతో చిన్న నిర్మాతల ప్రతినిధులు చర్చలు జరిపారు.. కేవలం 20 నుండి 25 లక్షలలో థియేటర్ నిర్మించి ఇవ్వవచ్చిని చిన్న నిర్మాతలు తెలుసుకున్నారు. చిన్న సినిమా తీయడమే కాకుండా థియేటర్ కూడా నిర్మించుకోవాలంటే సాధ్యం అయ్యే పని కాదని గ్రహించి .. ఈ ప్రతి పాదనను రామోజీ రావు దగ్గరకు తీసుకు వెళ్ళారు.. ఈ మధ్య రామోజీ ఫిలిం సిటీలో చిన్న నిర్మాతలు దాదాపు రెండు వందల మంది రామోజీ రావు ఆహ్వానం మేరకు వెళ్ళి కలిశారు.. వారిని ఆప్యాయంగా అక్కున చేర్చుకున్న రామోజీ రావు .. నేను కూడా మీలో ఒకడిని.. మీరు తెచ్చిన ప్రతి పాదనలకు అనుకూలంగా చిన్న థియేటర్లను నిర్మించే విధంగా ప్రభుత్వాలతో మాట్లాడ్డమే కాకుండా పలు కార్పోరేట్ కంపెనీలకు కూడా చిన్న థియేటర్లను నిర్మించడానికి ఆహ్వానిద్దాము .. ఇందులో నా శాయ శక్తులా ప్రయత్నిస్తాను అని మాట ఇచ్చారు..
ఇక ఈ థియేటర్లు ఎక్కడెక్కడ కడతారు అనే విషయానికి వస్తే రెండు తెలుగు రాష్ర్టాల్లో మండల స్థాయిలో ఒక థియేటర్ ఉండే విధంగా ప్లాన్ చేయడం అలాగే సిటీల్లో పెద్ద పెద్ద షాపింగ్ మాల్ లు గ్రేటెడ్ కమ్యునిటీలు ఉన్న దగ్గర కూడా ఇలాంటి థియేటర్లను నిర్మాంచాలనే ఆలోచనతో ఉన్నారు.. దీనికి సంబందించిన కార్యాచరణ కమిటి ఏర్పడింది. త్వరలో ఈ సినిమా థియేటర్ల నిర్మాణం ఒక కార్యరూపం దాల్చే విధంగా ప్రయత్నాలు జరుగుతున్నాయి.. ఇది కార్యరూపం దాల్చితే చిన్న సినిమాలకు తప్పకుండా మళ్ళీ స్వర్ణయుగం తప్పకుండా వస్తుంది అనడంలో సందేహం లేదు.
-పర్వతనేని రాంబాబు