ఈ మధ్య కాలంలో చంద్రబాబుకు అటు జ్యోతిష్యం, వాస్తుల మీద నమ్మకం బాగా పెరిగిపోయినట్లు కనిపిస్తోంది. వాస్తుకు లేవని పలు ప్రభుత్వ కార్యాలయాలకు కోట్లు ఖర్చుపెట్టి మరమ్మతులుచేసిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా రాజధాని పేరు కూడా సంఖ్యాశాస్త్రం ప్రకారం ఉండేలా చంద్రబాబు జాగ్రత్త పడ్డారు. అందుకోసం ఆ పేరులోని ఆంగ్ల అక్షరక్రమంలో స్వల్ప మార్పులు చేశారు.
ఆంధ్రప్రదేశ్ నూతన రాజధాని పేరు అమరావతి అన్న సంగతి తెలిసిందే. అయితే సంఖ్యాశాస్త్రం కోసం ఈ పేరుకు కొన్ని మార్పులు చేశారు. సాధారణంగా అమరావతి పేరుకు amaravathi అనే స్పెల్లింగ్ వస్తుంది. అయితే సంఖ్యాశాస్త్రం ప్రకారం తొమ్మిది అక్షరాల ఇంగ్లిషు పేరు ఉండేలా ఏపీ ప్రభుత్వం జాగ్రత్త పడింది. అందుకోసం hను తొలగిస్తూ స్పెల్లింగ్‌ను amaravati గాపొందుపరిచింది. సింగపూర్ ప్రభుత్వం పొందుపరిచిన మాస్టర్ ప్లాన్‌లో కూడా రాజధాని పేరును ఇలాగే ప్రకటించారు. మరి బాబు సంఖ్యాశాస్త్రం నమ్మకం రాజధానికి ఎంతవరకు కలిసి వస్తుందో వేచిచూడాలి.