కేంద్రంలో ఉన్న ఎన్‌డీఏ ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనుకున్న టీఆర్‌ఎస్ ఆశలకు ఆదిలోనే బ్రేకు పడింది. కేంద్ర మంత్రిగా పనిచేయాలనుకుంటున్న సీఎం కేసీఆర్ కుమార్తె కవిత ఇదివరకే బీజేపీలో చేరే అంశంపై స్పందించారు. ప్రధాని ఆహ్వానిస్తే తమకు బీజేపీలో చేరడానికి ఎలాంటి ఇబ్బందులు లేవని రెండుమూడు సార్లు ప్రకటించి ఆమె మనసులోని మాట బయటపెట్టారు. ఈ ఆఫర్‌ను బీజేపీ నాయకులు మాత్రం ఒప్పుకోవడం లేదు.
అత్యధిక మెజార్టీతో అధికారంలోకి వచ్చిన బీజేపీకి ఇప్పుడు టీఆర్‌ఎస్ అవసరం లేదు. అంతేకాకుండా తెలంగాణలో బీజేపీని బలపర్చడానికి విస్తృంగా అవకాశాలున్నప్పుడు టీఆర్‌ఎస్‌తో కలవాల్సిన అవసరం ఏముందని కాషాయం నాయకులు ప్రశ్నిస్తున్నారు. తెలంగాణలో సింగిల్‌గానే ఎదగాలనుకుంటున్నామని, టీఆర్‌ఎస్ అవసరం తమకు లేదని ఆ పార్టీ జాతీయ నాయకుడు మురళిధర్‌రావు వ్యాఖ్యానించారు. దీన్నిబట్టి కేంద్రంలో టీఆర్‌ఎస్‌ను చేర్చుకునే అవకాశాలు ఏమాత్రం లేవని స్పష్టమవుతోంది. పాపం.. కేంద్ర మంత్రి కావాలనుకున్న కవిత ఆశ అడియాసగానే మిగిలిపోనుందని ఆమె వ్యతిరేకులు వ్యాఖ్యానిసున్నారు.