Advertisementt

కేన్స్ లో అలరిస్తున్న భామలు..!

Thu 21st May 2015 06:12 AM
68 kenes international film festival,sonam kapoor,aishwaryarai  కేన్స్ లో అలరిస్తున్న భామలు..!
కేన్స్ లో అలరిస్తున్న భామలు..!
Advertisement
Ads by CJ

68వ కేన్స్ అంతర్జాతీయ చలన చిత్రోత్సవం సందడిగా సాగింది. కొత్త, కొత్త ప్యాషన్లను ప్రపంచానికి పరిచయంచేస్తూ అందాల తరాలు పొడవాటి గౌన్లను, ఆభరణాలను ధరించి కెమెరాలకు పోజులిచ్చారు. ఇన్ని అందాల మధ్య ఎటువైపు చూడాలో తెలియక ప్రేక్షకలు అయోమయంలో పడ్డారు. ఈ కార్యక్రమంలో మన బాలీవుడ్ అగ్రతారలు సొనమ్ కపూర్, ఐశ్వర్య రాయ్ పాల్గొని విమర్శకుల ప్రశంసలు అందుకొన్నారు. సొనమ్ కపూర్ ధరించిన లేత ఆకుపచ్చ గౌను గురించి సామాజిక అనుసంధాన వేదికలో విమర్శల వర్షం కురుస్తుండటం గమనార్హం. ప్యాషన్ రంగంలో ఆమె ఇంకా ఎదగాలని పలువురు సూచిస్తున్నారు. నాలుగో రోజు 'ది సీ ఆఫ్ ట్రీస్' ప్రదర్శన కోసం నీలి రంగు గౌను ధరించి అందరినీ మెప్పించింది సొనమ్ కపూర్. చలన చిత్ర పరిశ్రమలో స్త్రీ, పురుష సమానత్వం గురించి జరిగిన చర్చల్లో ఐశ్వర్యారాయ్ పాల్గొన్నారు. ఆమె కేన్స్ లో పాల్గొనడం ఇది 14 వ సారి కావడం విశేషం. ఈ కార్యక్రమంలో 5 ఏళ్ళ తరువాత రీ ఎంట్రీ ఇస్తున్న ఐశ్వర్యారాయ్ 'జజ్బా' చిత్రం ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు.   

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ