ఆర్.నారాయణమూర్తి ప్రధాన పాత్రలో అల్లాణి శ్రీధర్ దర్శకుడిగా సానా యాదిరెడ్డి సమర్పణలో రూపొందనున్న బోనాల పోతరాజు సినిమా బోణం ఎత్తకుండానే ఆగిపోయింది అని విశ్వనీయ వర్గాల ద్వారా తెలిసింది.
పూర్వాపరాల్లోకి వెళితే తెలంగాణా లో అమ్మవారిని ఉత్సవాల్లో బోణాల పోతరాజుకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అమ్మవారిని కాచే అన్నగా బోణాల పోతరాజు కు ఎంతటి ప్రాధాన్యత ఉందో తెలిసిందే.. గోచీ పంచె కట్టుకోని చేతిలో కొరడా పట్టుకుని నుదిట పసుము మధ్యలో ఎర్రటి బొట్టుపెట్టుకుని కాళ్లకు గజ్జలు కట్టుకుని లయబద్దంగా నాట్యం చేస్తూ భయబ్రాంతి గొలిపే విధంగా ఉండే పోతరాజును చూస్తే పిల్లల్లో ఒనుకు పుడుతుంది. అలాంటి బోనాల పోతరాజు కథాంశాన్ని తీసుకుని దాన్ని తెరకెక్కించే ప్రయత్నం చేశారు.. దర్శకుడు అల్లాణి శ్రీధర్ ..
అల్లాణి శ్రీధర్ దర్శకుడిగా కొమరం భీమ్ సినిమా తరువాత పలు వైవిధ్యమైన చిత్రాలు తెరకు ఎక్కించారు. ప్రస్తుతం వారి దర్శకత్వంలో రూపొందిన చిలుకూరు బాలాజీ సినిమా విడుదలకు సిద్దం గా ఉంది. ఎక్కువగా ఆద్యాత్మిక చిత్రాలు సీరియల్స్ లు తీయడంలో అల్లాణి శ్రీధర్ ది అందె వేసిన చేయి.స్వతహాగా సౌమ్యుడు ... వివాదాలకు దూరంగా ఉండే వ్యక్తి.
ఇక ఆర్.నారాయణమూర్తి విషయానికి వస్తే ....తెలుగు చలన చిత్రరంగంలో తనకంటూ ఒక విశిష్టమైన స్తానాన్ని ఏర్పరుచుకున్న నటుడు దర్శకుడు.. సమాజంలో జరుగుతున్న పలు అంశాలను తీసుకుని దానికి విప్లవం జోడించి ఆలోచింప చేసే సినిమాలను తీయడంలో ఆయనకు ఆయనే సాటి.... రాజకీయ సామాజిక అంశాలే ప్రధానంగా సినిమాలు చేయడం అయన నైజం. ఆ మధ్య కోటి రూపాయలు ఇస్తాము మా సినిమాలో ఒక అతిధి పాత్ర చేయమన్నా చేయనని సున్నితంగా తిరస్కరించిన వ్యక్తి ... ఇది ఆయన వ్యక్తిత్వానికి సంబందించిన విషయం .
చిత్ర సమర్పకుడు సానాయాదిరెడ్డి విషయానికి వస్తే ఆయన న్యాయవాది.. పలు సినిమాలకు దర్శకుడు నిర్మాత గా కూడా ఉన్నాడు ప్రస్తుతం తెలంగాణా నిర్మాతల మండలి అథ్యక్షుడిగా ఉన్నాడు.
ఈ ముగ్గురు కలిసి బోనాల పోతరాజు సినిమా తీయడానికి అన్నీ సిద్దం చేసుకున్నారు. మేనెల 15న సినిమా ప్రారంభం అని ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు.
ప్రత్యక్ష్య సాక్షుల కథనం ప్రకారం
ఈ సినిమాకు ఛాయాగ్రహకుడిగా కూనిరెడ్డి శ్రీనివాస్ ను ఎంచుకున్నారు. అందరూ అల్లాణి శ్రీధర్ ఆఫీస్ లో కూడుకున్నారు.. ఏమి జరిగిందో ఏమో గాని ఆర్ .నారాయణమూర్తికి కూనిరెడ్డి శ్రీనివాస్ కు మాటా మాటా పెరిగి ఒకరి మీద ఒకరు దాడి చేసుకున్నారు.. ఈ ఘటనలో నారాయణమూర్తికి కత్తిపోట్లు అయ్యాయి.. నారాయణమూర్తి కూనిరెడ్డి శ్రీనివాస్ తల పగల కొట్టడం ..ఉన్నట్టుండి అక్కడ హింసాత్మక వాతావరణం నెలకొంది. ఈ ఘటనలో ఆఫీసు మొత్తం రక్త సిక్తమయింది. నారాయణమూర్తి.. కూనిరెడ్డి శ్రీనివాస్ మీదికి విసిరిన రాయి గురితప్పి అల్లాణి శ్రీధర్ తలవెనుక భాగంలో తగిలి తీవ్ర రక్త స్రావం కావడంతో హుటా హుటిన ఆసుపత్రికి తరలించారు.. తరువాత గాయపడ్డ నారాయణమూర్తిని కూనిరెడ్డి శ్రీనివాస్ ను కూడా ఒక్కొక్కరిని ఒక్కో ఆసుపత్రికి తరలించారు... ఈ గొడవను ఆపడానికి ప్రయత్నించిన అల్లాణి శ్రీధర్ కు ప్రాణాపాయం తృటిలో తప్పింది.
ఈ ఘటన జరిగిన తరువాత ఎవ్వరూ పోలీసులకు సమాచారం ఇవ్వలేదు .. మీడియాలో కూడా ఎలాంటి కథనాలు రాలేదు..
అయితే జరిగిన ఈ దుర్ఘటన వల్ల ఈ ప్రాజెక్ట్ నిరవధికంగా వాయిదాపడ్డట్టు సమాచారం.
- పర్వతనేని రాంబాబు