Advertisementt

తెలంగాణకంటే ఏపీలో 300 కోట్లు అధికం..!!

Wed 20th May 2015 07:21 AM
telangana,andhpradesh,registration,revenue  తెలంగాణకంటే ఏపీలో 300 కోట్లు అధికం..!!
తెలంగాణకంటే ఏపీలో 300 కోట్లు అధికం..!!
Advertisement

ఆంధ్రప్రదేశ్‌ విభజనతో తెలంగాణకు అధిక లాభం చేకూరింది. ఆదాయ వనరులన్నీ హైదరాబాద్‌లోనే ఉండటంతో తెలంగాణ మిగులు బడ్జెట్‌ రాష్ట్రమైంది. అయితే గతంతో పోలిస్తే ఇప్పుడు ఓ విషయంలో ఆంధ్రప్రదేశ్‌ కంటే తెలంగాణ వెనుకబడింది. రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వాలకు సమకూరే ఆదాయం ఆంధ్రప్రదేశ్‌లో గణనీయంగా పెరగగా.. తెలంగాణలో మాత్రం భారీగా పడిపోయింది.

ఏపీలో గతేడాదితో పోల్చితే ఈసారి రిజిస్ట్రేషన్‌ ఆదాయం దాదాపు 57శాతం పెరిగింది. ఈ శాఖ ద్వారా ఏడాది కాలంలో ప్రభుత్వానికి 2800 కోట్ల ఆదాయం సమకూరింది. అత్యధికంగా కృష్ణ జిల్లా నుంచి 478 కోట్ల ఆదాయం రాగా.. గుంటూరు జిల్లానుంచి 432 కోట్లు, విశాఖ జిల్లాలో 409 కోట్ల ఆదాయం సమకూరింది. ఇక అదే సమయంలో తెలంగాణలో మాత్రం రిజిస్ట్రేషన్‌ ఆదాయం 2487 కోట్లు మాత్రమే. ఇది ఏపీ కంటే దాదాపు 3ంం కోట్లు తక్కువ. విభజనకు ముందు తెలంగాణనుంచి రాష్ట్ర ప్రభుత్వానికి అధిక మొత్తంలో రిజిస్ట్రేషన్‌ ఆదాయం సమకూరేది. అయితే విజభన తర్వాత ఇక్కడ రియల్‌ వ్యాపారం బలహీనపడింది. అదే సమయంలో ఏపీలో రాజధాని ఏర్పాటుకు సంబంధించి రియల్‌ వ్యాపారం ఊపందుకుంది. గుంటూరు, కృష్ణ జిల్లాల్లో అధిక ఆదాయం రావడానికి కూడా ఇదే కారణం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement