ఈమధ్య కాలంలో కేంద్ర ప్రభుత్వంతో టీఆర్‌ఎస్ వ్యవహార శైలి పూర్తిగా మారింది. అప్పట్లో బీజేపీని వైరి పక్షం కింద లెక్క కట్టిన కేసీఆర్ ఆ పార్టీ నాయకులపై తీవ్ర విమర్శలు చేసేవారు. కాని ఇటీవలే కేసీఆర్ బీజేపీ పట్ల మెతక వైఖరిని అవలంబిస్తున్నారు. దీనికి కారణం తన కూతురు కవితకు కేంద్ర మంత్రి పదవి ఇప్పించడానికేననే వాదనలు వినిపించాయి. దీనిపై ఇన్నాళ్లుగా స్పందించడానికి ఇష్టపడి కవిత ఎట్టకేలకు తన మనసులోని మాట బయటపెట్టింది. ప్రధాని మోడీ తనను క్యాబినెట్‌లో చేరాలని ఆహ్వానిస్తే అప్పుడు ఆలోచిస్తానని చెప్పింది. దీన్నిబట్టి ఎన్‌డీఏలో చేరడానికి టీఆర్‌ఎస్‌కు ఎలాంటి ఇబ్బంది లేదనే విషయం స్పష్టమైంది.
అయితే టీఆర్‌ఎస్, బీజేపీ మైత్రి బంధానికి టీడీపీ, ఎంఐఎం రూపంలో ప్రతిబంధాకాలున్నాయి. ఇప్పటికే ఎన్‌డీఏలో భాగస్వామిగా ఉన్న టీడీపీ బీజేపీలో టీఆర్‌ఎస్ చేరికను వ్యతిరేకిస్తుందనడాననికి ఎలాంటి అనుమానం అక్కరలేదు. మరోవైపు టీఆర్‌ఎస్ మిత్రపక్షం ఎంఐఎం కూడా ఎన్‌డీఏలో గులాభిదళం చేరికను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించే అవకాశం లేదు. ఇక టీఆర్‌ఎస్ ఇప్పుడు కేంద్రంలో చేరాలంటే ఎంఐఎంను వదులుకోవాల్సిందే. కాని జీహెచ్‌ఎంసీ ఎన్నికలు, ముస్లిం ఓట్ల దృష్ట్యా కేసీఆర్ ఇంతటి సాహసం చేస్తారనేది అనుమానమే. దీన్నిబట్టి కవితకు కేంద్ర మంత్రి పదవి రావాలంటే కనీసం మరో 8 నెలలు వేచిచూడక తప్పదేమో..!