Advertisementt

కేటీఆర్‌, లోకేష్‌ల్లో లక్ష్యాన్ని చేరింది ఎవరు..??

Tue 19th May 2015 05:55 AM
ktr,lokesh,america,tour  కేటీఆర్‌, లోకేష్‌ల్లో లక్ష్యాన్ని చేరింది ఎవరు..??
కేటీఆర్‌, లోకేష్‌ల్లో లక్ష్యాన్ని చేరింది ఎవరు..??
Advertisement
Ads by CJ

ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి తనయుడు.. అటు ఏపీ సీఎం తనయుడు ఒకేసారి అమెరికాలో పర్యటించడం కాకతాళియమే కావొచ్చు. అయితే వారిద్దరి పర్యటనల్లో ఏది విజయవంతమైందనే దానిపై ఇప్పుడు తెలుగు ప్రజల్లో చర్చలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే తన పర్యటన ముగించుకొని నారా లోకేష్‌ హైదరాబాద్‌కు చేరుకున్నారు. మరోవైపు కేటీఆర్‌ పర్యటన ఇంకా కొనసాగుతూనే ఉంది.

నారా లోకేష్‌ పర్యటనను టీడీపీ అనుకూల మీడియా సాధ్యమైనంత ఎక్కువ చేసి చూపడానికి ప్రయత్నించింది. అందులో భాగంగానే లోకేష్‌ అమెరికా అధ్యక్షుడు ఒబామాను కలిసి పెట్టుబడుల గురించి ప్రసంగిస్తారని కూడా చెప్పింది. అయితే ఒబామాతో లోకేష్‌ది అధికారభేటీ కాదని రూ. 5 లక్షలు చెల్లించి ఓ ఫొటో దిగడానికి మాత్రమే అనుమతి సాధించారనే విషయం తేలడంతో టీడీపీ భవిష్యత్తు అధినేత పరువుపోయింది. ఇక లోకేష్‌ రాష్ట్ర అధికారప్రతినిధి కాకపోవడంతో ఎన్‌ఆర్‌ఐలను కలుసుకోవడం, పలు సంస్థల ప్రతినిధును కలుసుకునే వారకే పరిమితమయ్యారు. ఏ సంస్థతోనూ అధికారిక ఒప్పందాలు చేసుకోలేకపోయాడు.

ఇక కేటీఆర్‌ అమెరికాలోని పలు అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులను వరుసపెట్టి కలుసుకుంటున్నాడు. రాష్ట్ర మంత్రిగా ఆయన తెలంగాణ అధికార ప్రతినిధిగా అమెరికాలో పర్యటిస్తున్నాడు. పలు కంపెనీల సీఈఓలతో హైదరాబాద్‌లో పెట్టుబడులకు సంబంధించి ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాడు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో తన అతిపెద్ద రెండో క్యాంపస్‌ను ఏర్పాటుచేయడానికి గూగుల్‌ సంస్థ ఒప్పుకుంది. ఇక మంగళవారం ఆయన మెక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదేళ్లతో కూడా భేటీ కానున్నాడు. ఈ విషయాలను తరచిచూస్తే అటు లోకేష్‌ పర్యటన మీడియా కోసమే అన్నట్లు సాగగా.. కేటీఆర్‌ పర్యటన మాత్రం హైదరాబాద్‌కు పెట్టుబడులు ఆకర్షించడంలో విజయవంతమైందని చెప్పవచ్చు.

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ