నాగార్జున, అల్లు అర్జున్ ఏ ప్రయోగం చేసినా ఆదరించే ప్రేక్షకులున్నారు.
అమితాబ్, దీపికా పదుకొణె నటించిన ‘పీకూ’ ప్రపంచ వ్యాప్తంగా విడుదలయి వసూళ్ళ రికార్డులు సృష్టిస్తోంది. ఒకప్పుడు వైవిధ్యమైన పాత్రలతో, కథలతో, కాన్సెప్టులతో కమల్ చేసే ప్రయోగాలను ప్రేక్షకులు ఆదరించేవారు. కానీ ఇటీవల కమల్ చిత్రాలలో ఆ మేజిక్ టచ్ మిస్సవుతోంది. ఆ స్ధానాన్ని భర్తీ చేయగల సత్తా తెలుగులో అల్లు అర్జున్‌కి మాత్రమే వుంది. తెలుగు, మలయాళీ, తమిళ, కన్నడ మార్కెట్ వున్న అల్లు అర్జున్‌తో ప్రయోగాలు చేయవచ్చు.
అలాగే భేషజాలు లేని నటుడు, మూసపోసిన మాస్ చిత్రాలకే పరిమితం కాని నటుడు నాగార్జునతో దమ్మున్న దర్శక నిర్మాతలు ప్రయోగాలు చేస్తే ఆదరించే ప్రేక్షకులున్నారు. అందుకు అన్నమయ్య, రాజన్న, మనం గొప్ప ఉదాహరణలు. కథ, కాన్సెప్టులో వైవిధ్యం లేకుంటే ఎంత పెద్ద స్టార్ సినిమా అయినా రెండు వారాల ఓపెనింగ్ కలెక్షన్సుతో సరిపెట్టుకుంటోంది. మూసపోసిన ఫైట్స్, డాన్సుల నుంచి తెలుగు సినిమా బయటపడాలి.
-తోటకూర రఘు