ఆర్టీసీ కార్మికుల సమ్మెకు మంత్రి హరీష్‌రావు మద్దతు ఉందని టీడీపీ ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి ఆరోపించి 24 గంటలు కూడా గడవకముందే అది నిజమని తేలింది. స్వయంగా టీఎంయూ యూనియన్ నాయకుడు అశ్వత్థామరావు అది నిజమని ప్రకటించాడు. మరి కేసీఆర్ సర్కారులో మంత్రిగా ఉన్న హరీష్‌రావు ఎందుకు సమ్మె చేయమని కార్మికులను రెచ్చగొట్టాడన్నది ఇప్పుడు అర్థంకాని ప్రశ్న.
ప్రస్తుతం తెలంగాణలో వారసత్వ పోరు నడుస్తోంది. కేటీఆర్, హరీష్‌రావు రెండు వర్గాలకు నాయకులుగా వ్యవహరిస్తున్నారు. వీరిద్దరూ ఎవరికివారే తెలంగాణలో బలమైన నాయకులుగా ఎదిగే ప్రయత్నంలో ఉన్నారు. ఇక మాస్ లీడర్‌గా మంచి ఫాలోయింగ్ కలిగి ఉన్న హరీష్‌రావుకు టీఆర్‌ఎస్‌లోని పలువురు ఎమ్మెల్యేల మద్దతు ఉంది. దీనికితోడు ప్రజల్లోనూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హరీష్‌రావు ఇక ఉద్యోగ సంఘాల మద్దతు కూడా దక్కించుకునేందుకే ఆర్టీసీ కార్మికుల సమ్మెకు పరోక్షంగా మద్దతు పలికారన్న వాదనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా అశ్వత్థామరెడ్డి రవాణాశాఖ మంత్రి మహేందర్‌రెడ్డిపై కూడా ఆరోపణలు చేయడం విస్మయాన్ని కలిగిస్తోంది. ఆయన సమర్థుడు కాదని, సీఎం కేసీఆర్ జోక్యంచేసుకొని ఆర్టీసీ కార్మికులకు న్యాయం చేయాలని అశ్వత్థామరెడ్డి డిమాండ్ చేశారు. ఇక తన సహచర మంత్రిని అసమర్థుడని యూనియన్ నేతలు విమర్శించే స్థాయికి హరీష్‌రావు పరిస్థితి ఎందుకు తీసుకొచ్చారన్నది ఇప్పుడు సందిగ్ధంగా మారింది.