Advertisementt

సినీజోష్ ఇంటర్వ్యూ: తాప్సి(గంగ)

Sat 09th May 2015 08:48 AM
thapsi,ganga movie,raghava larence,nithya menon  సినీజోష్ ఇంటర్వ్యూ: తాప్సి(గంగ)
సినీజోష్ ఇంటర్వ్యూ: తాప్సి(గంగ)
Advertisement
Ads by CJ

'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమయిన నటి తాప్సి. 'మిస్టర్ పర్ ఫెక్ట్' , 'గుండెల్లో గోదారి' , 'సాహసం' వంటి సినిమాలో నటించి మంచి పేరు సంపాదించుకుంది. ప్రస్తుతానికి తాప్సి కి తెలుగులో అవకాశాలు లేవు. రీసెంట్ గా తమిళంలో ఆమె నటించిన 'గంగ' సినిమాను తెలుగులో విడుదల చేసారు. మే 1న విడుదలయిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఈ సందర్భంగా తాప్సి తో సినీజోష్ ఇంటర్వ్యూ..

సినిమాలో మీ పాత్రకి ఎలాంటి రెస్పాన్స్ వస్తోంది..?

రెండు సంవత్సరాల తరువాత తెలుగులో నా సినిమా విడుదలయింది. ఈ చిత్రం హిట్ అవుతుందని తెలుసు కానీ మరీ ఇంత పెద్ద హిట్ అవుతుందని ఊహించలేదు. మామూలు హీరోయిన్ గా కాకుండా ఓ విభిన్నమైన పాత్రలో నన్ను చూపించారు. ఇంతక ముందు ఇలాంటి చిత్రంలో నేను నటించలేదు. ఇప్పటి వరకు నేను  గ్లామరస్, క్యూట్, ఇన్నోసెంట్ రోల్స్ ఉన్న సినిమాలలో మాత్రమే కనిపించాను. మొదటిసారి 'గంగ' లాంటి చిత్రంలో నటించాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన లారెన్స్ కు పెద్ద థాంక్స్.

ఈ సినిమాలో నిత్యమీనన్ పాత్ర మిమ్మల్ని డామినేట్ చేసిందని ఫీల్ అయ్యారా..?

నిత్య మంచి టాలెంటెడ్ పెర్సన్. అధ్బుతంగా నటిస్తుంది. ఈ సినిమాలో తను నన్ను డామినేట్ చేసిందని నాకు అనిపించలేదు. తను తెరపై కనిపించిన ఇరవై నిమిషాల వ్యవధిలో ప్రేక్షకులను ఆకట్టుకుంది. నేను నటించిన 'బేబీ' మూవీ లో కూడా నేను ఇరవై నిమిషాలు మాత్రమే కనిపిస్తాను. కాని ఆ సినిమాతో నాకు చాలా మంచి పేరు వచ్చింది. నిత్య కూడా అంతే తన పాత్రలో తను నటించింది. 

సినిమా షూటింగ్ సమయంలో ఏమైనా కష్టపడ్డారా..?

సినిమా మొదటి భాగం సింపుల్ గా, నేచురల్ గా సాగిపోతుంది. సెకండ్ హాఫ్ లో చాలెంజింగ్ రోల్ లో నటించాల్సి వచ్చింది. చాలా కష్టపడి చేసాను. ఫస్ట్ షాట్ లో దయ్యంలా నటించడానికి సుమారుగా 35 నుండి 40 టేక్స్ తీసుకున్నాను. అలానే సిగరెట్ కాల్చే సన్నివేశంలో కూడా చాలా టేక్స్ తీసుకున్నాను. నాకు అసలు సిగరెట్ ఎలా హ్యాండిల్ చేయాలో తెలియదు. ఎప్పుడు ట్రై చేయలేదు. అందుకే చాలా టేక్స్ తీసుకున్నాను.

దయ్యాలు ఉన్నాయని నమ్ముతారా..?

ఖచ్చితంగా ఉన్నాయి. దేవుడు ఉంటే దయ్యం కూడా ఉంటుంది కదా. ప్లస్ ఉన్నప్పుడు మైనస్ కూడా ఉంటుంది.

ఈ సినిమా ద్వారా ఏమైనా నేర్చుకున్నారా..?

నేను ప్రతి సినిమాలో ఏదొక అంశం నేర్చుకుంటూనే ఉంటాను. యాక్టింగ్, బాడీ లాంగ్వేజ్, కాన్ఫిడెన్స్, ఎలాంటి స్క్రిప్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలనే విషయాలపై ఎక్కువ కాన్సన్ ట్రేట్ చేస్తాను. లారెన్స్ గారి దగ్గర నుండి మల్టీటాస్కింగ్ నేర్చుకున్నాను. దర్శకుడిగా, నటుడిగా, డాన్సర్ గా తన టాలెంట్ ఏంటో ప్రూవ్ చేసుకున్నారు.

ఎలాంటి పాత్రల్లో నటించాలనుంది..?

ఇప్పటివరకు గ్లామరస్ రోల్స్ లో, నటన కు తక్కువ ప్రాధాన్యం ఉన్న సినిమాలో నటించాను. ఇకపై పెర్ఫార్మన్స్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనే నటిస్తాను. 'బేబీ' సినిమాలో కూడా పెర్ఫార్మన్స్ ఓరియెంటెడ్ రోల్ లోనే నటించాను.   

తెలుగులో సినిమా ఎప్పుడు చేస్తారు..?

ప్రస్తుతం తమిళంలో రెండు సినిమాలలో నటిస్తున్నాను. తెలుగు సినిమాలో నటించే అవకాశం వస్తే ఖచ్చితంగా నటిస్తాను. 

Advertisement
Ads by CJ

Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ